AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత సహా బాలిక తండ్రి అరెస్ట్..

స్థానిక ఆసుపత్రిలో మైనర్ వధువుకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ARY న్యూస్ నివేదించింది. ఈ ఆందోళనకరమైన సంఘటన పాకిస్తాన్‌లో బాల్య వివాహాల నిరంతర కొనసాగుతున్నాయని.. ఈ వివాహాలు అరికట్టడం అక్కడ ఒక సవాల్ అనే విషయాన్ని నొక్కి చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, యువతుల శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.

13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత సహా బాలిక తండ్రి అరెస్ట్..
Elderly Groom Arrested
Surya Kala
|

Updated on: May 08, 2024 | 8:50 AM

Share

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్‌లో 13 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నందుకు 70 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ARY న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ పెళ్లి చట్టవిరుద్ధంగా, ఆందోళనకరమైన చర్యగా అభివర్ణించారు. నివేదికల ప్రకారం మైనర్ బాలికకు ఆమె తండ్రి స్వయంగా వృద్ధుడితో వివాహం చేశాడు. పెళ్లి గురించి సమాచారం అందుకున్న స్వాత్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. 70 ఏళ్ల వరుడిని, పెళ్లి కూతురు తండ్రిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు సాక్షులను, నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుండగా స్థానిక ఆసుపత్రిలో మైనర్ వధువుకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ARY న్యూస్ నివేదించింది. ఈ ఆందోళనకరమైన సంఘటన పాకిస్తాన్‌లో బాల్య వివాహాల నిరంతర కొనసాగుతున్నాయని.. ఈ వివాహాలు అరికట్టడం అక్కడ ఒక సవాల్ అనే విషయాన్ని నొక్కి చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, యువతుల శ్రేయస్సుకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.

పాకిస్తానీ చట్టం ఏమి చెబుతుందంటే

పాకిస్తాన్ లో పాత వివాహ నిరోధక చట్టం 1929 ప్రకారం అమ్మాయిలకు 16,అబ్బాయిలకు 18 వివాహ కనీస వయస్సును నిర్ణయించింది. అయితే ప్రస్తుత పాకిస్తాన్ చట్టం ప్రకారం వివాహ కనీస వయస్సును 18కి పెంచే ప్రయత్నాలు చేసినప్పుడు… ఇస్లామిక్ సంప్రదాయవాద సమూహాల నుండి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో, బలహీనమైన మైనర్‌ల హక్కులను పరిరక్షించడంలో పురోగతికి ఆటంకం కలిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..