AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీయూలో చికిత్స పొందుతున్న భార్య.. మెడికల్ బిల్లు కట్టలేక చంపేసిన భర్త.. ఎక్కడంటే

ఐసీయూలో ఉండి చికిత్స తీసుకుంటున్న భార్యను ఓ భర్త గొంతు కోసి చంపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. నిందితుడు రోనీ విగ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని కారణంగానే చంపినట్లు అంగీకరించాడు. మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌లోని సెంటర్‌పాయింట్ మెడికల్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Us Man Kills Wife
Surya Kala
|

Updated on: May 08, 2024 | 8:25 AM

Share

భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎక్కడో పుట్టి.. పెళ్లి అనే వేడుకతో ఒక బంధంలోకి అడుగు పెట్టి.. ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం గడుపుతారు. ఒకరికి కష్టం వస్తే.. మరొకరి కంట కన్నీరు వస్తుంది. అలాంటి బంధంలో కూడా బీటలు పడుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే విడిపోయేవరకూ వెళ్తున్నారు. అంతేకాదు కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి హత్య చేసే వరకూ వెళ్తున్నారు. తాజాగా మెడికల్ బిల్లు కట్టలేక భార్యను హత్య చేశాడో కసాయి భర్త . ఈ దారుణ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఐసీయూలో ఉండి చికిత్స తీసుకుంటున్న భార్యను ఓ భర్త గొంతు కోసి చంపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. నిందితుడు రోనీ విగ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని కారణంగానే చంపినట్లు అంగీకరించాడు. మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌లోని సెంటర్‌పాయింట్ మెడికల్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఐసీయూలో ఉన్న రోగిని హతమార్చేందుకు ప్రయత్నించడాన్ని చూసిన ఆస్పత్రి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసు అధికారిని సంప్రదించి మృతురాలు భర్తపై ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

తన భార్య ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ఆర్థికంగా, మానసికంగా చాలా కష్టాలు పడుతున్నాను. దీంతో భార్యను చంపాలని నిర్ణయించుకున్నట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ఫాక్స్ పేర్కొంది. విగ్స్ గతంలో కూడా రెండుసార్లు ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్