- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips: power of morning rituals transforming fate Before you step out of the house
Astro Tips: ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం.. రోజంతా హాయిగా సాగిపోతుంది..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజు వారీ జరిగే అనేక విషయాలు మన జీవితాలపై మంచి చెడుల ప్రభావాన్ని చూపుతాయి. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఉదయం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎవరైనా కొన్ని ప్రత్యేక విషయాలను చూస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఏ పని కోసం వెళ్తున్నారో ఆ పనిలో విజయం సాధిస్తారని అవి చూచిస్తాయని నమ్మకం. ఉదయం లేచిన వెంటనే రోజు బాగా ప్రారంభమైతే ఆ రోజంతా చక్కగా సాగుతుందని కూడా అంటారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే కొన్ని విషయాలను చూడటం కూడా జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రోజును చక్కగా గడపడమే కాకుండా జీవితంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు ఉదయం లేచిన వెంటనే వీటిని చూడడం శుభప్రదమో తెలుసుకుందాం..
Updated on: May 08, 2024 | 7:29 AM

సూర్యోదయం చాలా శుభప్రదం: హిందూ మతంలో ఉదయించే సూర్యుడిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఉదయించే సూర్యుడు చాలా అందంగా కనిపించినా.. ఆ సూర్య కిరణాలు చీకటిని తొలగించి కొత్త ప్రారంభానికి .. కాంతితో తనను తాను నింపుకోవడానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఉదయించే సూర్యుడు మనకు స్ఫూర్తినిస్తుంది. రాత్రి లేదా చీకటి తర్వాత కాంతి ప్రసరిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్యుడిని చూడటం, నమస్కరించడం వలన జీవితంలో సానుకూల శక్తి నింపబడుతుంది. విజయం లభిస్తుంది.

పక్షి: ఉదయాన్నే ఆకాశంలో పక్షులు స్వేచ్చగా ఎగురుతూ, కిలకిలారావాలు చేస్తూ సందడి చేస్తాయి. ఈ దృశ్యం చూడడం కూడా జీవితంలో కొత్త ఆశను, ఉత్సాహాన్ని నింపుతుంది. అనేక సంస్కృతులలో ఎగిరే పక్షులను చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు.

వికసించే పువ్వులు: ఉదయాన్నే వికసించే పువ్వులను చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వికసించే పూల వలనే జీవితంలో ఎప్పుడూ వికసిస్తూనే ఉండాలని సూచిస్తాయి. పువ్వుల అందం, శక్తివంతమైన రంగులు, అవి వెదజల్లే సువాసన ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఆకాశం: నీలి రంగులో హృదయాన్ని ఆకట్టుకునే అంబరాన్ని చూడడం కూడా మనస్సుకు సాంత్వన, శాంతిని అందిస్తుంది. ఇది అపరిమితమైన విస్తారమైన, శాంతియుతమైన, ప్రేమతో కూడిన వ్యక్తీకరణలను రేకెత్తిస్తుంది. ఆకాశం అపరిమితమైన అవకాశాలను కూడా ప్రేరేపిస్తుంది.

స్నేహితుడు: ఉదయాన్నే ప్రియమైన స్నేహితుడిని కలవడం లేదా ప్రేమించే గుణం ఉన్న అపరిచితుడిని కలుసుకోవడం అనేది రోజు శుభప్రదానికి సంకేతంగా పరిగణించబడుతుంది. సానుకూలత, ప్రేమపూర్వక సంభాషణలు రోజంతా సానుకూల శక్తితో నిండిపోయే వాతావరణాన్ని సృష్టించగలవు.

ఇంద్రధనస్సు: సప్తవర్ణాల ఇంద్రధనస్సును చూడడం అనేక సంస్కృతుల్లో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సామరస్యం, అదృష్టం , దేవుడి ఆశీర్వాదాలను సూచిస్తుంది. ఇంద్రధనస్సును చూడటం జీవితంలో ఆనందం, అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్మకం.

సీతాకోకచిలుకలు: సీతాకోక చిలుకలు జీవితంలో జరిగే మార్పు, అందం, ఆధ్యాత్మిక పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి. సీతాకోక చిలుకల ఉనికి సానుకూల శకునానికి చిహ్నంగా కూడా కనిపిస్తుంది. సీతాకోక చిలుకను చూడటం మార్పును స్వీకరించడానికి, జీవితంలోని మార్పుల అందాన్ని స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది.

నవ్వుతున్న పిల్లలు: వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు నవ్వుతూ, ఆడుకుంటూ, నవ్వుతూ చూడటం శుభసూచకంగా పరిగణించబడుతుంది. వాటిని చూడటం వలన ఆనందం, అమాయకత్వం మంచి అనుభూతినిస్తుంది. దీంతో రోజంతా సానుకూలంగా ఉంటారు. పిల్లల నవ్వు , చిరునవ్వు అదృష్టం, ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు.

నాణెం: నేలపై పడి ఉన్న నాణేన్ని చూడటం అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.




