Hyderabad Rains: కుండపోత వానతో అల్లాడిన భాగ్యనగర వాసులు.. విద్యుత్ షాక్‌తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జడివానతో బంజారాహిల్స్‌ జడిసిపోయింది. బండెనక బండి కట్టి అన్నట్లు వేలాది వాహనాలు ఒక దాని వెనుక ఒకటి నిలిచిపోయాయి. వర్షం వేసిన స్పీడ్‌ బ్రేకర్‌తో ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తాయి. లక్డీకాపూల్‌లో కూడా సేమ్‌ సీన్‌ కనిపించింది. ప్రధాన రహదారులు, కూడళ్లు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద ముంచెత్తింది. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. నిజాంపేటను వరద ముంచెత్తింది. ఓ అపార్ట్‌మెంట్‌ నీట మునిగింది. పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

Hyderabad Rains: కుండపోత వానతో అల్లాడిన భాగ్యనగర వాసులు.. విద్యుత్ షాక్‌తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Hyderabad Rains
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 8:12 AM

ఎండ, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన భాగ్యనగర వాసులకు ఒక్కసారిగా వేసవి ఉక్కబోత నుంచి ఉపశమనం లభించింది.  హఠాత్తుగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. నాన్‌స్టాప్‌ రెయిన్‌ నరకం చూపింది. సిటీ జనాన్ని భయపెట్టింది. గాలివానతో నగరం చిగురుటాకులా వణికింది. భాగ్యనగరం అల్లాడింది. కుండపోత వానతో కుదేలైంది. మంగళవారం సాయంత్రం మొదలైన వర్షం అర్ధరాత్రి వరకూ కురిసింది. భారీ వర్షంతో జనం బెంబేలెత్తారు. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హైదరాబాద్‌ బయోడైవర్సిటీ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. టీ హబ్‌ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు నరకం చూశారు.

ఉరుము లేని పిడుగులా పడ్డ వాన నగర జనానికి చుక్కలు చూపింది. దానికి తోడు భీకరగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. కాలనీలు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరు వాన, హోరు గాలితో ఎల్బీనగర్‌ తడిసి ముద్దయింది. వర్షంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఖైరతాబాద్‌లో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చిన్న సైజు వాగులుగా మారాయి. అటు పాదచారులతో పాటు ఇటు వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.

జడివానతో బంజారాహిల్స్‌ జడిసిపోయింది. బండెనక బండి కట్టి అన్నట్లు వేలాది వాహనాలు ఒక దాని వెనుక ఒకటి నిలిచిపోయాయి. వర్షం వేసిన స్పీడ్‌ బ్రేకర్‌తో ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తాయి. లక్డీకాపూల్‌లో కూడా సేమ్‌ సీన్‌ కనిపించింది. ప్రధాన రహదారులు, కూడళ్లు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద ముంచెత్తింది. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. నిజాంపేటను వరద ముంచెత్తింది. ఓ అపార్ట్‌మెంట్‌ నీట మునిగింది. పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

అమీన్‌పూర్‌ చెరువులో అలలు ఎగిసిపడ్డాయి. జోరు గాలికి చెరువు కాస్తా…ఊరి మీద పడుతుందా అన్నంత అలజడి రేగింది. బహదూర్‌పురాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో నడుస్తూ కరెంట్‌ పోల్‌ను పట్టుకోవడంతో ఒకరు మృతిచెందారు. బహదూర్‌పురా క్రాస్‌రోడ్‌ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..