Hyderabad: సొంత ఇల్లు కొంటున్నారా..? రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టులే బెస్ట్.. ఎందుకంటే..

రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులు వారికి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎవరైనా డెవలపర్స్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్న సందర్భంలోనూ తప్పనిసరిగా సంబంధిత సంస్థల పర్మిషన్ నంబర్లు రెరా నంబర్ కూడా ముద్రించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేస్తే ఇబ్బందుల నుంచి గట్టు ఎక్కవచ్చు అంటున్నారు అధికారులు.

Hyderabad: సొంత ఇల్లు కొంటున్నారా..? రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టులే బెస్ట్.. ఎందుకంటే..
Hyderabad
Follow us

| Edited By: Surya Kala

Updated on: Feb 09, 2024 | 6:07 PM

హైదరాబాద్ నగరంలో ఒక మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు జీవితకాలం పైసా పైసా దాచి తమ కష్టార్జితాన్నంత తన బిడ్డల భవిష్యత్తు కోసం ఇళ్లను కొంటారు కొందరు. మంచి ఉద్యోగం వచ్చిందంటే చాలు వేలకు వేలు ఈఎంఐలు చెల్లిస్తూ సొంత ఇంటి కలల్ని నెరవేర్చుకుంటారు మరి కొందరు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేసే ఇల్లు లేదా ఇంటి స్థలం విషయంలో చేసే చిన్న తప్పులతో భారీగా నష్టపోతున్నారు పబ్లిక్. తక్కువ రేటు అంటూ లాంచింగ్ ఆఫర్ అంటూ వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నాయి కొన్ని సంస్థలు. ఇల్లు ప్లాట్ల కొనుగోలు మోసాలకు గురి కాకుండా మంచి ఇంటిని సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్తికి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఏం చేయాలి ఆస్తుల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

సొంత ఇల్లు.. ఈ మాట మనలో చాలా మందికి ప్రశాంతత నిచ్చే అంశం. కుటుంబ బాధ్యతల్లో ఉన్న ప్రతి వ్యక్తి సొంత ఇంటి కోసం కలలుగంటారు. చిన్నదో పెద్దదో తమ ఆర్థిక స్తోమతను బట్టి ఒక ఇల్లు కట్టుకోవాలని లేదా ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. తన కుటుంబానికి తన బిడ్డలకు సెక్యూరిటీ ఉండేలా మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తుంటారు. అందుకోసం కొంతమంది తమ జీవితాంతం కష్టపడి పోగేసుకున్న డబ్బునంత వెచ్చించి ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేస్తారు. మరికొందరు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఈఎంఐ గా చెల్లిస్తూ సొంత ఇల్లు కొంటుంటారు. అయితే ప్లాట్లు ఇళ్లు కొనుగోలు విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న మోసాలు ఇలాంటి అంశాలను నొక్కి చెబుతున్నాయి.

కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని రియాలిటీ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంటాయి. నిబంధనలకు నీళ్లు వదిలి.. ఫ్రీ లాంచ్ ఆఫర్… తక్కువ ధర అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ కంపెనీలు వస్తున్నాయంటారు. భవిష్యత్తులో భారీగా రేట్లు పెరుగుతాయి అంటారు. గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తారు. తక్కువ ధరేకదా అని డబ్బులు చెల్లించారో ఇక అంతే సంగతులు. అదిగో ఇదిగో అంటూ బోర్డు తిప్పేసారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా అక్కడక్కడ కొన్ని రియాల్టీ సంస్థలు వినియోగదారులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. కోట్లాది రూపాయలు పోగేసుకుని ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాయి. దీంతో లబోదిబోమనడం కస్టమర్ల వంతు అవుతుంది. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరి ఇళ్ల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నిర్మాణ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న మాటలను ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది మనలో చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్రాపర్టీ కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తరువాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ లేఅవుట్ లేదా నిర్మాణానికి సంబంధిత విభాగాల పర్మిషన్లు ఉన్నాయా వాటి వివరాలను పూర్తిగా చెక్ చేసుకోవాలి. తర్వాత క్షేత్రస్థాయిలో లేఅవుట్ లేదా భవన నిర్మాణ ప్రాంతం పనులను పరిశీలించుకోవాలి. నిర్మాణ సంస్థ చెబుతున్నట్లుగా ఆ ప్రాజెక్టు ఇన్ టైం లో పూర్తి అవుతుందా అనేది ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాట్లు ఇల్లు.., ఆస్తులు కొనుగోలు చేస్తున్న సందర్భంలో మోసపోకుండా ఉండేందుకు  తప్పనిసరిగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలంటున్నారు నిపుణులు.

ప్రాజెక్టులను పరిశీలించేటప్పుడు ఆయా ప్రాంతాలను బట్టి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి లేదా లోకల్ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఇచ్చే పర్మిషన్లు సరైనవేనా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. అంతే కాకుండా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లో మీరు కొనాలనుకుంటున్న ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలంటున్నారు అధికారులు. కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ కోసం టిఎస్ రేరా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రాజెక్టు అనుకున్న టైం కు పూర్తి కాకుంటే అందుకు తగిన నష్టాన్ని కొనుగోలుదారుకు చెల్లించే అవకాశం రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుకు ఉంటుంది. రేరాలో ఒక ప్రాజెక్టు రిజిస్టర్ అయ్యిందంటే అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సరైనవిగా భావించేందుకు అవకాశం ఉంటుంది. రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులు వారికి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎవరైనా డెవలపర్స్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్న సందర్భంలోనూ తప్పనిసరిగా సంబంధిత సంస్థల పర్మిషన్ నంబర్లు రెరా నంబర్ కూడా ముద్రించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేస్తే ఇబ్బందుల నుంచి గట్టు ఎక్కవచ్చు అంటున్నారు అధికారులు.

ఇక ల్యాండ్ టైటిల్ విషయంలోనూ ఇన్ టైమ్ లో ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ, ఈ ప్రాజెక్టు కోసం వసూలు చేసిన డబ్బులు ఇక్కడ ఎక్కువ శాతం ఖర్చు చేయ్యడంలోనూ రెరాలో నమోదు చేసుకున్న డెవలపర్స్, తప్పని సరిగా నిభందనలు పాటిస్తారు. అనుభవజ్ఞులైన లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ .., ఆర్కిటెక్చర్స్ ఇచ్చిన పత్రాలు లెక్కలు రేరాకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో కోనుగోలు దారులకు ఇచ్చిన హామిలను కాకుండా ఇతర మార్పులు చేర్పులు చేసే సమయం కొనుగోలు చేసిన వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ టైమ్ లో ప్రాజెక్టు హ్యాండ్ ఒవర్ చేయ్యకపోయినా, కొనుగోలుదారులు రేరాను ఆశ్రయించవచ్చు. దీంతో వేగంగా న్యాయం జరగడమే కాకుండా కొనుగోలు దారులు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి, నష్టంగా పరిహారం పోందడానికి వీలౌతుంది. సో తప్పనిసరిగా అనుమతులు పొందిన  ప్రాజెక్టలు రేరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల్లో ఇళ్లు ఆస్తులు.. ప్లాట్లు కోనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవంటున్నారు అధికారులు.

గత కొద్ది కాలంగా గ్రేటర్ పరిధిలో వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను అడ్డంగా మోసం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇల్లు ప్లాట్లు ఇతర ఆస్తులు కొనుగోలు సమయంలో సిటిజన్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఎంతో శ్రమకూర్చి సంపాదించుకున్న సొమ్ము వృధా అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
మళ్లీ మొదలు.. ఎందుకిలా.? కల్కిపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.!
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
చిన్నప్పుడే నా ఫోటోలు అలాంటి సైట్స్‌లో పెట్టారు
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
ఆ మున్సిపాలిటీ‎లో అవిశ్వాస సెగలు.. చైర్మన్ పదవికి తప్పని గండం..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..