Hyderabad Rain: హైదరాబాద్‌ని ఉతికి ఆరేసిన వాన.. ఇంకా ముగియలే

హైదరాబాద్‌ అతలాకుతలమైంది. నాన్‌స్టాప్‌ రెయిన్‌ నరకం చూపింది. సిటీ జనాన్ని భయపెట్టింది. గాలివానతో నగరం చిగురుటాకులా వణికింది. నిన్న సాయంత్రం మొదలైన వర్షం అర్ధరాత్రి వరకూ కురిసింది. భారీ వర్షంతో జనం బెంబేలెత్తారు. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Hyderabad Rain: హైదరాబాద్‌ని ఉతికి ఆరేసిన వాన.. ఇంకా ముగియలే
Telangana Rain
Follow us
Ram Naramaneni

|

Updated on: May 08, 2024 | 7:21 AM

ఇప్పటివరకు మండుటెండలతో అల్లాడిన హైదరాబాదీలకు అంతకుమించిన చుక్కలు చూపించాడు వరుణుడు. ఎండ వేడిమి నుంచి ఏదో ఊరట దొరుకుతుందిలే అనుకుంటే… రావడం రావడమే ప్రతాపం చూపించాడు. మంగళవారం సాయంత్రం ఐదున్నరకు మొదలైన జోరువాన… అర్ధరాత్రి వరకు రప్ఫాడించింది. కుండపోత వర్షానికి తోడు ఈదురుగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయ్‌. అప్పుడే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. కాలు తీసిన కాలు కదపలేనంతగా ట్రాఫిక్‌జామ్స్‌ కావడంతో నరకయాతన పడ్డారు హైదరాబాదీలు.

హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో ఒకసారి చూద్దాం — మియాపూర్‌ – 14 సెం.మీ. –కేపీహెచ్‌బీ – 12 సెం.మీ. –చందానగర్‌ – 11 సెం.మీ. –బాచుపల్లి – 11 సెం.మీ. –సికింద్రాబాద్‌ – 11 సెం.మీ. –యూసుఫ్‌గూడ – 11 సెం.మీ. –కృష్ణానగర్‌ – 11 సెం.మీ. –ఆర్సీపురం – 10 సెం.మీ. –లింగంపల్లి – 10 సెం.మీ. –గచ్చిబౌలి – 10 సెం.మీ. –సుల్తాన్‌పూర్ – 10 సెం.మీ. –బోరబండ – 9 సెం.మీ. –బాలాజీనగర్‌ – 9 సెం.మీ. –మోతీనగర్‌ – 9 సెం.మీ. –మూసాపేట్‌ – 8 సెం.మీ. –జూబ్లీహిల్స్ – 8 సెం.మీ. –ఫతేనగర్‌ – 7 సెం.మీ. –కుత్బుల్లాపూర్ – 7 సెం.మీ.

హైదరాబాద్‌ వాసులకు ఈరోజు, రేపు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది వాతావరణశాఖ. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు మెరుపులతో గాలివాన ఉంటుందని..  పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. మొత్తం ఆరు జోన్లకు కూడా ఎల్లో వార్నింగ్‌ ఇచ్చింది.  చార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో మోస్తరు నుంచి భారీ వర్షసూచన చేసింది.  ఇవాళైతే, తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్‌కే ఇచ్చింది వాతావరణశాఖ. అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..