AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amavasya: అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది..

అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతే కాదు బ్రాహ్మణులకు పితృ తర్పణం, పిండ ప్రదానం, హవనం, అన్నదానం చేసి పూర్వీకుల ఆశీస్సులు పొంది వారికి శాంతి చేకూర్చే సంప్రదాయం ఉంది. అంతేకాదు ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Amavasya: అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది..
Vaisakha Masam Amavasya
Surya Kala
|

Updated on: May 08, 2024 | 6:49 AM

Share

ఈ రోజు చైత్ర మాసంలో చివరి రోజు అమావాస్య. ఈ అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. చిత్ర మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య తేదీని చైత్ర అమావాస్యగా జరుపుకుంటారు. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతే కాదు బ్రాహ్మణులకు పితృ తర్పణం, పిండ ప్రదానం, హవనం, అన్నదానం చేసి పూర్వీకుల ఆశీస్సులు పొంది వారికి శాంతి చేకూర్చే సంప్రదాయం ఉంది.

అంతేకాదు ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

చైత్ర మాస అమావాస్య 2024

ఇవి కూడా చదవండి

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య  తిధి మంగళవారం మే 7, ఉదయం 11:40 గంటలకు ప్రారంభమై.. ఈ రోజు బుధవారం, మే 8 ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ రోజు (మే 8వ తేదీ) బుధవారం అమావాస్య పూజధికార్యక్రమాలను నిర్వహిస్తారు.

అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

  1.  చైత్ర మాస అమావాస్య రోజున ప్రతీకారానికి దూరంగా ఉండాలి. ఈ రోజు మద్యం, మాంసాహారం తీసుకోకూడదు.
  2. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈ రోజు చీపురు కొంటె.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
  3. విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు తలకు నూనెతో మసాజ్ చేయకూడదు లేదా తలపై నూనె రాయకూడదు.
  4. అమావాస్య రోజున జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు.
  5. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభ కార్యాలు చేయడం నిషేధం.
  6. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు.
  7. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!