Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు దృష్టిలో పెట్టుకోండి..

ఆచార్య చాణక్య విధానంలో సంపద అధిదేవత లక్ష్మిదేవికి  సంబంధించిన అనేక విధానాలు ప్రస్తావించారు. ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంపదను ఎలా కూడబెట్టుకోగలడు? ప్రస్తుత కాలంలో సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో చాణక్యుడి చెప్పిన విధానాల గురించి తెలుసుకుందాం.. తరచుగా ప్రజలు తమ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్నీ తమ సన్నిహితులకు చెబుతారు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా వారు తమ మనస్సు భారాన్ని తగ్గించుకుని తేలికగా మారింది అని భావిస్తారు. అయితే మీ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని ముందు ఒదారుస్తారు..  మీ వెనుక ఎగతాళి చేయడానికి వెనుకాడరు.

Chanakya Niti: జీవితంలో ఆర్థిక ఇబ్బందులా.. చాణుక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు దృష్టిలో పెట్టుకోండి..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2024 | 12:29 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే..  ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆచార్య చాణక్య విధానంలో సంపద అధిదేవత లక్ష్మిదేవికి  సంబంధించిన అనేక విధానాలు ప్రస్తావించారు. ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంపదను ఎలా కూడబెట్టుకోగలడు? ప్రస్తుత కాలంలో సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో చాణక్యుడి చెప్పిన విధానాల గురించి తెలుసుకుందాం.. 

తరచుగా ప్రజలు తమ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్నీ తమ సన్నిహితులకు చెబుతారు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా వారు తమ మనస్సు భారాన్ని తగ్గించుకుని తేలికగా మారింది అని భావిస్తారు. అయితే మీ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని ముందు ఒదారుస్తారు..  మీ వెనుక ఎగతాళి చేయడానికి వెనుకాడరు.

చాణక్య నీతిలో ఎవరైనా తన మనస్సులో ఉన్న ఏదైనా దుఃఖం ఇతరులకు చెప్పాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. భార్య ప్రవర్తన గురించి, ఎవరైనా అవమానించడం గురించి, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే వారి హృదయంలో మీ గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు మీ ఈ విషయాలను ఎగతాళి చేయవచ్చు లేదా వాటి నుండి ప్రయోజనం పొందవచ్చు.

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికీ చెప్పకండి. మీ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. అలాగే ఏ భర్త కూడా తన భార్య గురించి ఎవరికీ చెప్పకూడదు. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంపై వాదోపవాదాలు జరుగుతుంటే అలాంటి విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఇలా చేయడం వలన భార్యతో దూరం పెరుగుతుంది.

ఆర్థిక సంక్షోభం ఉండదు

జీవితంలో డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం రెండూ చాలా ముఖ్యం. అయితే డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేసే వ్యక్తి భవిష్యత్తులో డబ్బును పోగొట్టుకోడు. సరికదా కష్ట సమయాల్లో కూడా సాధారణ జీవితాన్ని గడపగలడు. అదే విధంగా అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వ్యక్తిని తెలివితక్కువవాడు అంటారు. అలాంటి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

రిస్క్ తీసుకోవడానికి బయపడకండి

జీవితంలో డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధిస్తాడు. అందువల్ల ఎవరైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే భయపడకూడదు. వృత్తి ఏదైనా సరే  విజయంలో రిస్క్ పెద్ద పాత్ర పోషిస్తుంది. లక్ష్మిని చంచలమైనదిగా భావిస్తారు. అందువల్ల, డబ్బును సరైన స్థలంలో సరైన సమయంలో ఉపయోగించాలి. దీనిని సాధనంగా ఉపయోగించాలి. ఎందుకంటే తప్పుడు ప్రయోజనాల కోసం లేదా దుర్మార్గ పనుల కోసం డబ్బు ఖర్చు చేసే వ్యక్తి కొంతకాలం తర్వాత నాశనం అవుతాడు.

నీ కథ ఎవరికీ చెప్పకు

చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి డబ్బు కోసం అధర్మ మార్గాన్ని అవలంబించవలసి వస్తే లేదా డబ్బు కోసం శత్రువుతో చేతులు కలపాల్సి వస్తే అటువంటి డబ్బుకు దూరంగా ఉండటం మంచిది. డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి లక్ష్యం తెలుసుకోవడం ముఖ్యం. లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే ఎవరైనా సరే  విజయం సాధించలేరు. చాణక్యుడు ప్రకారం డబ్బు సంబంధిత పని గురించిన సమాచారం ఎవరికీ చెప్పరాదు. మీ రహస్యాలను ఇతరులకు చెబితే, మీ పని చెడిపోయే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నాడు. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు