- Telugu News Photo Gallery Hydration In Summer: foods that improves hydration in summer watermelon cucumber strawberry
Hydration In Summer: తరచుగా డీ హైడ్రేట్ బారిన పడుతున్నారా? మీ డైట్‌లో ఈ జ్యుసి వస్తువులను చేర్చుకోండి
వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండవేడికి ఎక్కువ దాహం వేస్తుంది. వేడి, వడగాల్పులతో శరీరం నుంచి నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకి విసర్జింప బడుతుంది. దీని కారణంగా మనం చాలాసార్లు డీహైడ్రేషన్ బారిన పడతాము. దీని వల్ల శారీరకంగా తరచుగా సమస్యలను ఎదుర్కొంటాం. దాహం వేసినా బద్ధకం వల్ల నీళ్లు తాగకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు కొందరు. ఇలా ఒకటి రెండు సార్లు జరిగితే ఫర్వాలేదు.. కానీ ఇలా పదే పదే చేస్తుంటే వెంటనే ఈ అలవాటు మార్చుకోండి. నీరు త్రాగక పొతే శరీరానికి తీవ్ర హాని కలుగుతుంది.
Updated on: May 03, 2024 | 4:51 PM

కీర దోస: శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కీరదోసకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవి కాలంలో రోజూ కీర దోస కాయ తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. దీనితో పాటు శరీరంలో విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం భారీ మొత్తంలో శరీరానికి లభిస్తుంది. బరువు తగ్గడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే తినే ఆహారంలో కీరదోస కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు లేవు.

పుచ్చకాయ: వేసవిలో ఆర్ద్రీకరణకు పుచ్చకాయ ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఇందులో 94 శాతం నీరు ఉంటుంది. ఈ కారణంగానే వేసవి కాలంలో పుచ్చకాయకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

టమోటాలు: కురగాయాల్లో టమోటాలు కూడా శరీరాన్ని డీహైడ్రేట్ గా ఉంచుతుంది. టమోటాలను కూరల్లో ఉపయోగించడంతో పాటు, టమోటా సలాడ్‌ను కూడా తయారు చేసి ప్రతిరోజూ తినవచ్చు. వాటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ శరీరంలోని అనేక పోషకాల లోపాన్ని తీరుస్తాయి.

ఎరుపు క్యాప్సికం: రెడ్ క్యాప్సికమ్ లో 92 శాతం నీరు ఉంది. దీనితో అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. నీరు కాకుండా.. క్యాప్సికమ్ నుంచి అనేక రకాల పోషకాలు, విటమిన్ సి కూడా పొందుతారు.

స్ట్రాబెర్రీలు: వేసవి కాలంలో స్ట్రాబెర్రీలను తినడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో 91 శాతం నీరుతోపాటు పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇది విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్ ల అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది.




