Dark Elbows Home Remedies: మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్ హోం రెమిడీస్ ట్రై చేయండి.. మెరుపు ఖాయం!
వేసవి ఎండలో ఎక్కువగా బయట ఉండడం వల్ల చర్మం టాన్ అవుతుంది. మోచేతులు నల్లబడటం అనేది తరచుగా కనిపించే సమస్యల్లో ఒకటి. దీని వల్ల కొంతమందికి ఇష్టమైన బట్టలు కూడా ధరించలేరు. ఎందుకంటే మోచేతుల నలుపు కారణంగా, వారి అందానికి మచ్చపడినట్టుగా ఫీల్ అవుతుంటారు. దీంతో కొందరు పార్లర్ల చుట్టూ పరుగులు పెడుతుంటారు. కానీ పదేపదే పార్లర్ ట్రీట్ మెంట్ అంతమంచిది కాదు.. పైగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అటువంటి పరిస్థితిలో మోచేతుల నలుపును తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 02, 2024 | 11:54 AM

నిమ్మరసం: మోచేతిపై నిమ్మరసం రాసి ఒకటి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. నిమ్మరసంలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంద. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

పెరుగు, ఉప్పు: ఒక చిన్న గిన్నెలో పెరుగు, ఉప్పు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మోచేతులపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. నలుపును తొలగిస్తుంది.

అలోవెరా జెల్: తాజా కలబంద ఆకును కట్ చేసి, దాని జెల్‌ను తీసి మోచేయిపై రాయండి. 20-30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగడం వల్ల చర్మానికి తాజాదనం, మెరుపు వస్తుంది.

క్రీమ్, పసుపు: క్రీమ్‌లో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసి మోచేతులపై రాయండి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. పసుపు చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది. క్రీమ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

శనగ పిండి, పాలు: శనగపిండిలో కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసి మోచేతికి పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మ ఛాయను క్లియర్ చేస్తుంది. నలుపును తొలగిస్తుంది. ఈ ఇంటి నివారణలను ఉపయోగించే ముందు మీకు అలెర్జీ సమస్యలు ఉంటే, వాటిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించండి.





























