Kubera Yoga: కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. ఇల్లు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశం

వివిధ సమయాల్లో గ్రహాలు రాశుల్లో మార్పు కారణంగా శుభ లేదా అశుభకరమైన యాదృచ్ఛికాలు, యోగాలు  సంభవిస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మానవులపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా మే 1, 2024న దేవగురువు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కుబేర యోగం ఏర్పడింది. ఈ కుబేర యోగం 12 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇది 3 రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపబోతోంది. కుబేర యోగం ఏర్పడటం వల్ల అదృష్టాన్ని పొందబోతున్న మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం

Kubera Yoga: కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. ఇల్లు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశం
Kubera Yoga 2024
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 7:58 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు చలన స్థితిలో ఉంటాయి. దీంతో గ్రహాలు వివిధ రాశుల్లో తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. అన్ని గ్రహాలు నిరంతరం 12 రాశులలో సంచరిస్తూనే ఉంటాయి. వివిధ సమయాల్లో గ్రహాలు రాశుల్లో మార్పు కారణంగా శుభ లేదా అశుభకరమైన యాదృచ్ఛికాలు, యోగాలు  సంభవిస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మానవులపై ప్రభావం చూపుతాయి.

అదేవిధంగా మే 1, 2024న దేవగురువు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కుబేర యోగం ఏర్పడింది. ఈ కుబేర యోగం 12 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇది 3 రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపబోతోంది. కుబేర యోగం ఏర్పడటం వల్ల అదృష్టాన్ని పొందబోతున్న మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం?

ఈ మూడు రాశుల వారిని వరించే అదృష్టం:

మేష రాశి: మేష రాశి వారిపై కుబేర యోగం చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు కుబేరుడు, లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. సంపద, శ్రేయస్సును తెస్తుంది. రిటైల్ వ్యాపారం చేసే వ్యక్తులు ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. ఉద్యోగాలలో పని చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల మేష రాశి వారికి ధన, ధాన్యాల కొరత ఉండదు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: కుబేర యోగం కర్కాటక రాశి వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ యోగంతో ఈ రాశి వారు చేసే అన్ని పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో  విలాస వస్తువులు కనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇంటికి కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత ఇల్లు కొనుగోలు చేయవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు. వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. పిల్లలకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వారికి కుబేర యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ వ్యక్తుల ఆదాయం పెరగడమే కాదు ఖర్చులను నియంత్రణలో చేస్తారు. పొదుపు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు ఇంటి నుంచి చేసే పనులతో మంచి లాభాలను పొందుతారు. ఆహార వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా పెద్ద ప్రయోజనాలను పొందనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు