ఆ దేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌.. కలిసి జీవించడాని ఆంక్షలు లేవు, పిల్లల కనాలనే ఒత్తిడి లేదు..

వాస్తవానికి స్నేహ వివాహంలో భాగస్వాములు చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి శృంగార సంబంధం ఉండదు. ఈ వివాహంలో ఇద్దరూ కలిసి జీవిస్తారు లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే వివాహం తర్వాత కూడా విడిగా జీవించవచ్చు. అంతేకాదు ఇద్దరూ సమ్మతితో బిడ్డను కనాలని అనుకున్నట్లయితే, వారు కృత్రిమ మార్గాల ద్వారా బిడ్డను కనవచ్చు. ఈ వివాహంలో విచిత్రమైన  అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇలా వివాహం చేసుకున్న తర్వాత కూడా జంటలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో శృంగార సంబంధాలు కలిగి ఉంటారు

ఆ దేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌.. కలిసి జీవించడాని ఆంక్షలు లేవు, పిల్లల కనాలనే ఒత్తిడి లేదు..
Friendship Marriage
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2024 | 12:11 PM

ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం భిన్నంగా ఉంటాయి. కట్టు, బొట్టు, విందు, వేడుకలు ఇలా అన్నీ భిన్నమే.. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది భారతీయ హిందూ కుటుంబ వ్యవస్థ. వివాహ వేడుక. రెండు కుటుంబాల నుంచి యువతీయువకులు పెళ్లి అనే పవిత్ర వేడుకతో ఒకటి అవుతారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషలతో జీవిస్తారు. అయితే ఈ పెళ్లి సంప్రదాయానికి ఇతర దేశాలకు చెందిన యువత కూడా ఆకర్షింపబడుతోంది. అదే సమయంలో కొన్ని దేశాల్లోని యువత బాధ్యతలను తీసుకోవడానికి ఇష్ట పడడం లేదు. దీంతో ప్రేమ, సహజీవనం వద్దు స్నేహ పెళ్లి ముద్దు అని అంటున్నారు.

జపాన్‌కి చెందిన యువత కొత్త తరహా మ్యారేజ్ ట్రెండ్‌ని అవలంబిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో జంటల మధ్య ప్రేమ లేదా ఇతర సంబంధాలు ఉండవు. తాము ఇష్టపడిన యువతీ యువకులు, స్వలింగ సంపర్కులు ఇలా ఎవరైనా ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ వివాహ వేడుక్కి స్నేహ వివాహం అని పేరు పెట్టారు. ఇటువంటి వివాహాలను చేసుకున్న వ్యక్తులు వివాహంపై విశ్వాసం కోల్పోరు. లేదా ప్రేమలో పడలేరు. నివేదిక ప్రకారం, 2015 నుంచి సుమారు 500 మంది స్నేహ వివాహాన్ని స్వీకరించారు. అలా పెళ్లి చేసుకున్న వ్యక్తులు తమ భాగస్వాములతో కాలక్షేపం చేయవచ్చు. తమ సమస్యలను పంచుకోవచ్చు ..  కలిసి ఏదైనా ఇతర కార్యకలాపంలో పాల్గొనవచ్చు. జంటలు వారి అభిరుచులు, విలువల ఆధారంగా ఈ వివాహం చేసుకుంటారు.

ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ ఏమిటి?

వాస్తవానికి స్నేహ వివాహంలో భాగస్వాములు చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి శృంగార సంబంధం ఉండదు. ఈ వివాహంలో ఇద్దరూ కలిసి జీవిస్తారు లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే వివాహం తర్వాత కూడా విడిగా జీవించవచ్చు. అంతేకాదు ఇద్దరూ సమ్మతితో బిడ్డను కనాలని అనుకున్నట్లయితే, వారు కృత్రిమ మార్గాల ద్వారా బిడ్డను కనవచ్చు. ఈ వివాహంలో విచిత్రమైన  అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇలా వివాహం చేసుకున్న తర్వాత కూడా జంటలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో శృంగార సంబంధాలు కలిగి ఉంటారు. అది కూడా ఇద్దరి సమ్మతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకోవడం లైఫ్ పార్ట్‌నర్‌ని వెతుక్కోవడం లాంటిది కాదని.. మీ రూమ్‌మేట్‌ని వెతుక్కోవడం లాంటిదని ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోకడలను అనుసరిస్తున్న ఇతర దేశాలు

పెళ్లికి ముందు జంటలు గంటల తరబడి కలిసి గడిపి తమ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటారు. అంతే కాకుండా కలిసి భోజనం చేయాలా, ఇంటి ఖర్చులు ఎలా పంచుకోవాలి, ఇతర ఇంటి పనులను ఎలా విభజించుకోవాలి, ఇతర విషయాలపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. జపాన్ నుంచి  వచ్చిన ఒక నివేదిక ప్రకారం 32 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఈ స్నేహ వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు. జపాన్‌తో పాటు సింగపూర్‌లో కూడా కొంతకాలం క్రితం ఇద్దరు 24 ఏళ్ల యువతులు ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ చేసుకోవడంతో పాటు తమ క్లోజ్‌ఫ్రెండ్‌తో కలిసి చైనాలో ఇల్లు కొనాలనుకునే వారు చాలా మంది ఈ ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ను చేసుకుంటున్నారు. ఈ స్నేహ వివాహం యువతీయువకులను ఆకర్షింపబడుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్