AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: షాకింగ్‌ సీన్‌.. 54వ అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్న యువతి! అంతలో ఊహించని ట్విస్ట్

న్యూయార్క్‌లో ఓ యువతి 54వ అంతస్తు నుంచి దూకబోతుండగా.. కొందరు పోలీసులు హీరోల్లా ప్రవేశించి ఆమె ప్రాణాలు కాపాడారు. డ్రమటిక్‌గా మహిళ ప్రాణాలు పోలీసులు రక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల నిబద్ధతకు, దైర్య సాహసాలకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళను రక్షించిన విధానం సినిమా స్టంట్ కంటే తక్కువేం కాదని కామెంట్‌ సెక్షన్‌లో..

Watch Video: షాకింగ్‌ సీన్‌.. 54వ అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్న యువతి! అంతలో ఊహించని ట్విస్ట్
Dramatic Rescue Operation In New York
Srilakshmi C
|

Updated on: May 08, 2024 | 5:08 PM

Share

న్యూయార్క్‌లో ఓ యువతి 54వ అంతస్తు నుంచి దూకబోతుండగా.. కొందరు పోలీసులు హీరోల్లా ప్రవేశించి ఆమె ప్రాణాలు కాపాడారు. డ్రమటిక్‌గా మహిళ ప్రాణాలు పోలీసులు రక్షించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పోలీసుల నిబద్ధతకు, దైర్య సాహసాలకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళను రక్షించిన విధానం సినిమా స్టంట్ కంటే తక్కువేం కాదని కామెంట్‌ సెక్షన్‌లో కామెంట్లు పెడుతున్నారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. గత బుధవారం 33 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మాన్‌హాటన్ ప్రాంతంలోని 54 అంతస్తుల భవనంపైకి ఎక్కింది. గమనించిన కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ యూనిట్ (ఈఎస్‌యూ)కి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మహిళ భవనం పై నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాల్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసులపై అమర్చిన బాడీక్యామ్ నుంచి రికార్డ్ అయ్యింది. భవనంపైకి ఎక్కిన మహిళను రక్షించేందుకు పోలీసులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టి కాపాడారో వీడియో క్లిప్‌లో చూడవచ్చు. మహిళ వద్దకు వెళ్లేందుకు పోలీసు అధికారులు భవనం అద్దాల గోడ ఎక్కి 54వ అంతస్తులో ఉన్న ఆమెను చేరుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ స్లిట్‌ ఓపెనింగ్‌ ద్వారా ఇద్దరు పోలీసులు మహిళ పడిపోకుండా ఆమె ఎడమ చేతిని పట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తాడుతో కట్టిన ఇద్దరు పోలీసులు గాజు గోడ దాటి అవతలకు వెళ్లి మహిళను సురక్షితంగా ఇవతలకు తీసుకొస్తారు. అనంతరం పోలీసధికారులు కూడా గోడ దూకి సురక్షితంగా లోనికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన రెస్క్యూ వీడియోను న్యూయార్క్ పోలీసులు ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు, వారు పోలీసులకు కాల్ చేస్తారు. కానీ పోలీసులకు సహాయం అవసరమైనప్పుడు, వారు ESUకి కాల్ చేస్తారంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేసన్‌ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!