Offering to God: ఇదేం భక్తి సామీ.. శివయ్యకు నాలుక కోసి నైవేధ్యం పెట్టిన భక్తుడు! భయంతో జనాలు పరుగులు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా థానౌడ్ గ్రామంలో నివాసం ఉండే రాజేశ్వర్ నిషాద్ అనే 33 ఏళ్ల వ్యక్తి బుధవారం ఉదయం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి మంత్రాలు పఠించాడు. అనంతరం కత్తితో తన నాలుకను కోసేసుకున్నాడు. ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నానంటూ చెరువులోని ఓ రాయిపై ఉంచాడు. తీవ్ర రక్త స్రావంతో ఆలయంలో పడి ఉన్న అతడిని గుర్తించిన గ్రామస్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు..
దుర్గ్, మే 8: మూఢ నమ్మకం అనాలో.. మూఢ భక్తి అనాలో తెలియదు గానీ ఓ వ్యక్తి దేవుడికి నైవేద్యంగా తన శరీరంలోని ఓ భాగాన్ని నరికి సమర్పించాడు. చుట్టూ ఉన్న భక్తులు చూసి భయంతో హడలెత్తిపోయారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో బుధవారం (మే 7) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా థానౌడ్ గ్రామంలో నివాసం ఉండే రాజేశ్వర్ నిషాద్ అనే 33 ఏళ్ల వ్యక్తి బుధవారం ఉదయం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి మంత్రాలు పఠించాడు. అనంతరం కత్తితో తన నాలుకను కోసేసుకున్నాడు. ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నానంటూ చెరువులోని ఓ రాయిపై ఉంచాడు. తీవ్ర రక్త స్రావంతో ఆలయంలో పడి ఉన్న అతడిని గుర్తించిన గ్రామస్థులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం నిషాద్ భార్య (మూగ) బధిరురాలు. ఆమెకు మాటలు రావు. రాజేశ్వర్ నిషాద్‌కి మాటలువచ్చు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. రాజేశ్వర్ నిషాద్ ఈ రోజు ఉదయం ఆలయంలో పూజలు చేసి శివుడికి తన నాలుకను నైవేధ్యంగా సమర్పించాడు. ఇందుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాలుక కోసుకోవడానికి నిషాద్ ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా ఈ ఘటన మూఢనమ్మకానికి సంబంధించిన కేసుగా కనిపిస్తోందని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అంజోరా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.