AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు.. ఎయిర్ పోర్ట్‌లో ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి.. షాకింగ్ వీడియో వైరల్

తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధపెట్టాలి. లేదంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా పిల్లల ప్రాణాలను తీస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తల్లిదండ్రుల చిన్న తప్పిదం వల్ల ఓ చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. అయితే చిన్నారి ప్రాణం కాపాడబడడం విశేషం. వాస్తవానికి విమానాశ్రయంలో ఒక పిల్లవాడు హఠాత్తుగా లగేజీ కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కి హాయిగా కూర్చున్నాడు. బెల్టు కదులుతూ ఉండడంతో దానిపై కూర్చుకున్న చిన్నారి చాలా దూరం వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు.. ఎయిర్ పోర్ట్‌లో ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి.. షాకింగ్ వీడియో వైరల్
Child At The Airport
Surya Kala
|

Updated on: May 09, 2024 | 8:31 AM

Share

ప్రమాదకరమైన మలుపు.. జాగ్రత్తగా వెళ్ళండి అనే బోర్డుని తరచుగా చూస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఈ హెచ్చరిక రోడ్డు మలుపుల్లో, లేదా రోడ్లు మరమ్మతుల సమయంలో కనిపిస్తుంది. ఇలాంటి హెచ్చరికతో వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతారు. అయితే తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధపెట్టాలి. లేదంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా పిల్లల ప్రాణాలను తీస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తల్లిదండ్రుల చిన్న తప్పిదం వల్ల ఓ చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. అయితే చిన్నారి ప్రాణం కాపాడబడడం విశేషం.

వాస్తవానికి విమానాశ్రయంలో ఒక పిల్లవాడు హఠాత్తుగా లగేజీ కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కి హాయిగా కూర్చున్నాడు. బెల్టు కదులుతూ ఉండడంతో దానిపై కూర్చుకున్న చిన్నారి చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు ఎయిర్‌పోర్టు సిబ్బంది చిన్నారిని గమనించి పరుగున వచ్చి కన్వేయర్ బెల్టు మీద నుంచి చిన్నారిని కిందకు దించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

వీడియోలో కన్వేయర్ బెల్ట్ కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఇంతలో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల వదిలి  కన్వేయర్ బెల్ట్‌పై కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ బాలుడిని ఒక విమానాశ్రయ ఉద్యోగి న్వేయర్ బెల్ట్ నుంచి దింపి  రక్షించాడు. క్షేమంగా ఉన్న చిన్నారిని చూసి అక్కడ ఉన్న వారందరికీ ఊరట కలిగింది. బయటికి వెళితే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోకుండా తమ లోకంలో తాము ఉండే తల్లిదండ్రులకు ఈ వీడియో ఒక గుణపాఠం అని అంటున్నారు.

ఈ వీడియో @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఒక నిమిషం 5 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల 72 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు.

‘బిడ్డ అదృష్టవంతుడు.. అందుకే అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదని’ కొందరంటే.. ‘తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టాలి’ అని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో, చిలీలోని శాంటియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. అక్కడ 3 ఏళ్ల చిన్నారి విషయంలో ఇలా జరిగిందని ఒక వినియోగదారు పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ ఘటన జరిగింది.  అయితే ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us