AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దేవుడిని దూరం నుంచి చూడాలి అనుకోవాలి.. ఇలా కారుతో డైరెక్ట్ గా వెళ్ళకూడదు నాయనా..!

ఓ ఆలయానికి సుధాకర్ అనే వ్యక్తి తన కొత్త కారుకు పూజలు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. సంప్రదాయం ప్రకారం కొత్త వాహనానికి పూజ అనంతరం ఆలయం ముందు వాహనాన్ని డ్రైవర్ నెమ్మదిగా తరలించాల్సి వచ్చింది. కారు పూజ ముగించుకుని కారును కాస్త నెమ్మదిగా ముందుకు కదిలించిన సుధాకర్ వెంటనే బ్రేక్ నొక్కకుండా యాక్సిలరేటర్‌ను ఎక్కించాడు.

Watch Video: దేవుడిని దూరం నుంచి చూడాలి అనుకోవాలి.. ఇలా కారుతో డైరెక్ట్ గా వెళ్ళకూడదు నాయనా..!
New Car Damaged After Puja
Jyothi Gadda
|

Updated on: May 09, 2024 | 7:48 AM

Share

కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు తమకు ఇష్టమైన దేవాలయానికి వెళ్లి పూజలు చేయించుకుంటారు. ఇది దాదాపుగా అందరూ పాటిస్తుంటారు. అయితే, ఇక్కడ కూడా ఒక వ్యక్తి కొత్తగా కారు కొనుగోలు చేశాడు. తన ఇష్టమైన దైవం గుడికి వెళ్లి భక్తితో కారుకు పూజ చేయించుకున్నాడు.. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగి కొత్త కారు పూర్తిగా డ్యామేజ్‌ అయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని ఓ గుడి బయట పూజల కోసం వచ్చిన కొత్త కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కారు అదుపు తప్పి గుడి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేకపోయినా, కొత్త వాహనం మాత్రం చాలా డ్యామేజ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ఒకటి బయటకు వచ్చింది. కొత్త కారు ఎలా ప్రమాదానికి గురైందో స్పష్టంగా చూడవచ్చు. ఆలయం ముందు ఆగి ఉన్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలి ఆలయంలోకి ఎలా ప్రవేశించిందో స్పష్టంగా కనిపిస్తుంది.

కడలూరు జిల్లా శ్రీమూషణం ప్రాంతంలోని ఓ ఆలయానికి సుధాకర్ అనే వ్యక్తి తన కొత్త కారుకు పూజలు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. సంప్రదాయం ప్రకారం కొత్త వాహనానికి పూజ అనంతరం ఆలయం ముందు వాహనాన్ని డ్రైవర్ నెమ్మదిగా తరలించాల్సి వచ్చింది. కారు పూజ ముగించుకుని కారును కాస్త నెమ్మదిగా ముందుకు కదిలించిన సుధాకర్ వెంటనే బ్రేక్ నొక్కకుండా యాక్సిలరేటర్‌ను ఎక్కించాడు. దీంతో వాహనం ఒక్కసారిగా అతి వేగంతో ముందుకు వెళ్లి అదుపు తప్పి గుడి లోపలికి ప్రవేశించి స్తంభాన్ని ఢీకొట్టింది. పూజ సమయంలో ఓ వ్యక్తి కిటికీ దగ్గర నిల్చుని లోపల కూర్చున్న కారు యజమాని సుధాకర్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి కూడా కారుతో పాటు ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంలో కారు బాగానే దెబ్బతింది. కానీ, వాహన యజమాని ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. అనంతరం అక్కడకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తమ వెంట తీసుకెళ్లారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..