ఇదే ఓవర్ యాక్షన్ అంటే.. ఈవీఎం దగ్గర ఆ పని చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

పోలింగ్ బూత్‌లోని 'మార్కింగ్ కంపార్ట్‌మెంట్'కు చకంకర్ హారతి ఇస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. ఫోటో వైరల్ కావడంతో ఇలాంటివి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో విమర్శలు గుప్పించారు. దీనిపై విచారించమని భారత ఎన్నికల కమిషన్‌ను ట్యాగ్ చేశారు.

ఇదే ఓవర్ యాక్షన్ అంటే.. ఈవీఎం దగ్గర ఆ పని చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు
Aarti At Polling Booth
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2024 | 12:55 PM

2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశలో భాగంగా మహారాష్ట్రలోని 11 లోక్‌సభ స్థానాలకు మే7న ఓటింగ్ జరిగింది. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఖడక్‌వాస్లా డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ స్టేషన్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)కు పూజలు చేశారు. బారామ‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఖడక్‌వాసలా పోలింగ్ కేంద్రంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హార‌తి ఇచ్చారు. దీనికి సంబంధించి రూపాలీ చకంకర్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

పోలింగ్ బూత్‌లోని ‘మార్కింగ్ కంపార్ట్‌మెంట్’కు చకంకర్ హారతి ఇస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. ఫోటో వైరల్ కావడంతో ఇలాంటివి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో విమర్శలు గుప్పించారు. దీనిపై విచారించమని భారత ఎన్నికల కమిషన్‌ను ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ హార‌తికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..