Air India Express: విమాన ప్రయాణికులకు ముఖ్యగమనిక..! రాత్రికి రాత్రే 70 విమానాలు రద్దు.. కారణమేంటంటే..
విమానాల రద్దు కారణంగా ఇబ్బందిపడ్డ తమ అతిథులకు పూర్తి రీఫండ్ లేదా కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్ మరొక తేదీకి అందించబడుతుందని చెప్పారు. ఈరోజు మాతో ప్రయాణిస్తున్న అతిథులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు తమ విమానానికి ఇబ్బంది ఏర్పడిందో లేదో చెక్ చేసుకోవాలని వారు అభ్యర్థించారు.
విమాన ప్రయాణికులకు ముఖ్యమైన వార్త. మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఫ్లైట్ బుక్ చేసి ఉంటే లేదా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన విమానాలను రద్దు చేసింది. అదేదో ఒకటి రెండు కాదు.. ఏకంగా 70కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసి ఈ సమాచారాన్ని దేశప్రజలకు వెల్లడించారు. ఆకస్మికంగా సెలవుపై వెళ్లిన సిబ్బంది కారణంగానే విమానాలు రద్దు చేసినట్టుగా ప్రకటించారు.
గత 12 గంటల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రాత్రికి రాత్రే 70కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నివేదికల ప్రకారం, ఎయిర్‌లైన్‌లోని సీనియర్ సిబ్బంది చివరి నిమిషంలో అనారోగ్యంతో సెలవు తీసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేశారు. దీంట్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
"A section of our cabin crew has reported sick at the last minute, starting last night, resulting in flight delays and cancellations. While we are engaging with the crew to understand the reasons behind these occurrences, our teams are actively addressing this issue to minimise… https://t.co/fM6CFkVxnL pic.twitter.com/p8BH2HMlNj
— ANI (@ANI) May 8, 2024
ఈ మేరకు తమ అతిథులకు క్షమాపణలు చెబుతున్నామని ఆయన చెప్పారు. రద్దు కారణంగా ఇబ్బందిపడ్డ తమ అతిథులకు పూర్తి రీఫండ్ లేదా కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్ మరొక తేదీకి అందించబడుతుందని చెప్పారు. ఈరోజు మాతో ప్రయాణిస్తున్న అతిథులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు తమ విమానానికి ఇబ్బంది ఏర్పడిందో లేదో చెక్ చేసుకోవాలని వారు అభ్యర్థించారు.