AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!

వైరల్‌ వీడియోలో కొంత మంది రోడ్డుపక్కన కట్టిన ఫుట్‌పాత్‌పై హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్లంతా తాము సురక్షితంగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ, ఇంతలోనే వారిని మృత్యువు కాటేసింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ మీదకు దూసుకెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను బలంగా ఢీకొట్టింది. దాంతో..

Watch Video: షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!
Car Hits
Jyothi Gadda
|

Updated on: May 08, 2024 | 9:57 AM

Share

భూమి మీద నూకలు మిగిలుంటే ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినా కూడా బతికి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ, ఎక్స్‌పైరీ డేట్‌ అయిందంటే.. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మృత్యువు రావాల్సి వస్తే వస్తుందని అంటారు మన పెద్దలు. దాన్నుంచి నువ్వు తప్పించుకోలేవని చెబుతారు. సాధారణంగా రోడ్డు మధ్యలో నడవడం లాంటి ప్రాణహాని కలిగించే పొరపాట్లు ఎవరూ చేయరు. కానీ, రోడ్డు పక్కనే నడుస్తూ సురక్షితంగా ఉన్నామని అనుకోలేం. అలాంటిదే ఈ వీడియో. పాదచారుల కోసం కేటాయించిన స్థలంలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులను ఓ కారు ఢీ కొట్టిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒళ్లు జలధరించే ఆ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌ వీడియోలో కొంత మంది రోడ్డుపక్కన కట్టిన ఫుట్‌పాత్‌పై హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్లంతా తాము సురక్షితంగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ, ఇంతలోనే వారిని మృత్యువు కాటేసింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ మీదకు దూసుకెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను బలంగా ఢీకొట్టింది. దాంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బహుశ వారంతా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ భయంకరమైన ప్రమాదం తర్వాత ప్రాణాలు, గాయాలతో తప్పించుకున్న వారంతా షాక్‌లో ఉండిపోయి చూస్తున్నారు. కొందరు రోడ్డుపై చలనం లేకుండా పడివున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ హృదయ విదారక ప్రమాదానికి సంబంధించిన వీడియో @klip_ent అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 15 వేలకు పైగా వీక్షించగా, చాలా మంది వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. వీడియో చూసిన తర్వాత ఒకరు ఇది ఘోర ప్రమాదం అంటున్నారు. ప్రమాదానికి గురైన వారు ఖచ్చితంగా చనిపోయి ఉంటారని మరొకరు అంటున్నారు. ఇక్కడ వీడియోలో నీలిరంగు టీ-షర్ట్ ధరించిన వ్యక్తి అందిరిలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు, ఎందుకంటే అతనిని ఇంతటి విధ్వంసంలోనూ చిన్న గాయం, గీత కూడా పడకుండా తప్పించుకున్నాడని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..