West Nile fever: దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! పెరుగుతున్న కేసులు.. లక్షణాలు ఇవే..

కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చునని కూడా వెల్లడించారు. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పారు. జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే. వెస్ట్ నైల్ వైరస్ చికిత్సకు సరైనా మెడిసిన్‌, వ్యాక్సిన్ అందుబాటులో లేనందున నివారణ అవసరమని చెబుతున్నారు.

West Nile fever: దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! పెరుగుతున్న కేసులు.. లక్షణాలు ఇవే..
mosquitoes bite
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2024 | 7:39 AM

West Nile fever: నిఫా, కోవిడ్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తర్వాత కేరళలో ఇప్పుడు మరో కొత్త ఫీవర్ భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ వేగంగా వ్యాపిస్తోంది. కేరళలోని కోజికోడ్, మలప్పురం, త్రిసూర్ జిల్లాల్లో 10 మందికి వెస్ట్ నైల్ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో నలుగురు కోజికోడ్ జిల్లాకు చెందిన వారిగా తెలిసింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్వరం, వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని మంత్రి అభ్యర్థించారు.

వెస్ట్ నైల్‌ లక్షణాలు..

ఈ వ్యాధి సోకిన దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. రోగికి సకాలంలో చికిత్స అందించకపోతే, ఈ జ్వరం మెదడువాపుకు కూడా కారణమవుతుంది. దీనివల్ల మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో, ఈ వ్యాధి మరణానికి కూడా దారితీస్తుంది. వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, మైకము, జ్ఞాపకశక్తి లోపించడం, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయని వైద్యులు గుర్తించారు. కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చునని కూడా వెల్లడించారు. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పారు. జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే. వెస్ట్ నైల్ వైరస్ చికిత్సకు సరైనా మెడిసిన్‌, వ్యాక్సిన్ అందుబాటులో లేనందున నివారణ అవసరమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫీవర్‌ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. లక్షణాలు కనిపించి చికిత్స పొందిన వారి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం వారంతా వెస్ట్‌ నైల్‌ జ్వరంతో బాధపడుతున్నారని, సకాలంలో చికిత్స అందించడంతో వారంతా ఇప్పుడు కోలుకుంటున్నారని తెలిపారు. ఎవరికైనా జ్వరం లేదా వెస్ట్‌ నైల్‌ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..