యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? షాకింగ్‌ కారణాలను తెలుసుకోండి..

మొత్తమ్మీద ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని, దీని వల్ల మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? షాకింగ్‌ కారణాలను తెలుసుకోండి..
Junk Food Alert
Follow us
Jyothi Gadda

|

Updated on: May 06, 2024 | 12:59 PM

వృద్ధులకు మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకుంటే పొరపాటే. ఇది తప్పుడు ఆలోచన. స్థూలకాయం, తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ రోజుల్లో యువతలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 30 సంవత్సరాలలో పరిశీలించినట్టయితే.. కడుపు, పిత్తాశయం, పెద్దప్రేగు, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ చాలా వేగంగా పెరిగింది. ఇంతకుముందు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధులు ఇప్పుడు 40-50 ఏళ్లలోపు వారిలో కూడా కనిపిస్తున్నాయి. తీపి, ఉప్పు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. సిడ్నీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబిన్ వార్డ్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లలో, 30 నుండి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో పిత్తాశయ క్యాన్సర్ సంభవం 200శాతం, గర్భాశయ క్యాన్సర్ 158శాతం, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) 153శాతం, మూత్రపిండాలు 89శాతం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 83శాతం పెరిగిందని చెప్పారు.

ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు?

మొత్తమ్మీద ఈ వ్యాధి పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని, దీని వల్ల మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్‌ను ఎలా నివారించాలి..?

గర్భాశయ, కొలొరెక్టల్ (పెద్దప్రేగు) వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లు ప్రారంభ దశలో గుర్తించినట్టయితే సులభంగా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. కానీ బ్రెయిన్ క్యాన్సర్ లాంటి జబ్బుల్లో ముందుగా గుర్తించినా ప్రయోజనం ఉండదు. సెర్వికల్, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడానికి ఇవే ఉత్తమ మార్గాలని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను టీకాలు వేయడం ద్వారా నివారించవచ్చు. ముందుగానే గుర్తిస్తే చికిత్స కూడా చేయవచ్చు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) సంక్రమణ గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. టీకాలు వేయడం ద్వారా నివారించవచ్చు. రొమ్ము, గర్భాశయ, కొలొరెక్టల్ (పెద్ద ప్రేగు) క్యాన్సర్ కోసం జాతీయ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లను విస్తరించడం చికిత్సలో సహాయపడుతుంది. మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సరైన రకం క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ప్రయోజనకరమని, అయితే ప్రస్తుతం నడుస్తున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు వయస్సుపై ఆధారపడి ఉంటాయి. ప్రమాదంపై ఆధారపడి ఉండవని ప్రొఫెసర్ వార్డ్ చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..