Mutton Pulusu: మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్‌తో చేసుకోదగిన రెసిపీల్లో మటన్ పులుసు కూడా ఒకటి. ఇది వంటకం చాలా రుచిగా ఉంటుంది. మటన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ, చపాతీ, రాగి సంగటి, అన్నం వేటిల్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ వంటకం చేసుకోవచ్చు. అందరికీ బాగా నచ్చుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు.. మటన్ పులుసు చేసుకుంటే చాలా మంచిది. మటన్ పులుసు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం..
మటన్‌తో చేసుకోదగిన రెసిపీల్లో మటన్ పులుసు కూడా ఒకటి. ఇది వంటకం చాలా రుచిగా ఉంటుంది. మటన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ, చపాతీ, రాగి సంగటి, అన్నం వేటిల్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ వంటకం చేసుకోవచ్చు. అందరికీ బాగా నచ్చుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు.. మటన్ పులుసు చేసుకుంటే చాలా మంచిది. మటన్ పులుసు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎంతో రుచిగా ఉండే మటన్ పులుసును ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పులుసుకు కావాల్సిన పదార్థాలు:
మటన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, కరివేపాకు, ధనియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, గసగసాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు, ఆయిల్.
మటన్ పులుసు తయారీ విధానం:
ముందుగా కుక్కర్ తీసుకుని అందులో మటన్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నీళ్లు వేసి ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత కడాయిలో మసాలా పదార్థాలు అన్నీ వేసి వేయించు కోవాలి. ఇవి చల్లారాక మిక్సీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మసాలా పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించి.. ఆ తర్వాత టమాట ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఓ నిమిషం పాటు వేయించాక.. ఉడికించిన మటన్‌ను నీటితో సహా వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలా తగినంత వేసుకుని, మూత పెట్టి కాస్త దగ్గర పడేవరకూ ఉడికించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచింగా ఉండే మటన్ పులుసు సిద్ధం.