Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు..

స్ట్రాబెర్రీలంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టం. వాటి రుచి, సువాసన కూడా చాలా బావుంటుంది. స్ట్రాబెర్రీలతో ఎక్కువగా జ్యూసులు, స్మూతీలు, కేకులు వంటివి తయారు చేస్తారు. కానీ ఒక్కసారి ఇలా పాన్ కేకులు తయారు చేసి పిల్లలకు పెట్టండి. లొట్టలేసుకుంటూ.. అడిగి మరీ తింటారు. వీటిని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్‌ ఎలా అయినా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా మంచిదే. స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేయడానికి..

Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు..
Strawberry Pancake
Follow us

| Edited By: Phani CH

Updated on: May 06, 2024 | 11:28 PM

స్ట్రాబెర్రీలంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టం. వాటి రుచి, సువాసన కూడా చాలా బావుంటుంది. స్ట్రాబెర్రీలతో ఎక్కువగా జ్యూసులు, స్మూతీలు, కేకులు వంటివి తయారు చేస్తారు. కానీ ఒక్కసారి ఇలా పాన్ కేకులు తయారు చేసి పిల్లలకు పెట్టండి. లొట్టలేసుకుంటూ.. అడిగి మరీ తింటారు. వీటిని బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్‌ ఎలా అయినా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా మంచిదే. స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేయడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

స్ట్రాబెర్రీస్, గోధుమ పిండి, బటర్, గుడ్లు, పంచదార, వెన్నెల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, తేనె, పెరుగు.

స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారీ విధానం:

స్ట్రాబెర్రీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో పంచదార పొడి వేసి బాగా కలపాలి. నెక్ట్స్ గోధుమ పిండి, పెరుగు, బేకింగ్ సోడా వేసి మరోసారి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వెన్నిలా ఎసెన్స్, గుడ్డు, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం.. దోశ పిండి బ్యాటర్‌లా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బటర్ రాయండి. ఆ తర్వాత స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని అట్లులాగా వేసుకోవాలి. రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అవసరం అయితే బటర్ ఇంకొంచం వేసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెర్రీ పాన్ కేక్ సిద్ధం. ఇది చాలా తియ్యగా ఉంటుంది. అందులోనూ ఇందులో వేసే పదార్థాలు కూడా ఆరోగ్యకరమైనవే. కాబట్టి ఇది పిల్లలు ెలాంటి సందేహం లేకుండా తినవచ్చు.