AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: మామిడి పండ్లు తెగ లాగించేస్తున్నారా..? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే కళ్లు తేలేస్తారు..

పండ్లలో రారాజు.. మామిడిపండును ఇష్టపడని వారంటూ ఉండరు.. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆనందం వేసవిలో మాత్రమే ఉంటుంది. ఎండాకాలంలోనే మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత దీని రుచి ఆస్వాదించాలంటే కష్టమే.. అయితే.. మామిడి పండ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Mangoes: మామిడి పండ్లు తెగ లాగించేస్తున్నారా..? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే కళ్లు తేలేస్తారు..
ఈ పండులో ఉండే షుగర్ లెవెల్స్‌ కారణంగా మీరు షుగర్‌ సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే మీరు మామిడి పండు తినాలి అనుకుంటే మాత్రం రోజుకు సుమారు 1/2 కప్పు మామిడి పండు తింటే తినవచ్చు. అలాగే, మామిడిని తినేటప్పుడు ఇతర తీపి ఆహారాలను తినకుండా ఉండండి.
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2024 | 12:43 PM

Share

పండ్లలో రారాజు.. మామిడిపండును ఇష్టపడని వారంటూ ఉండరు.. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆనందం వేసవిలో మాత్రమే ఉంటుంది. ఎండాకాలంలోనే మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత దీని రుచి ఆస్వాదించాలంటే కష్టమే.. అయితే.. మామిడి పండ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, దీనిని తినేటప్పుడు జాగ్రత్త వహించాలి.. లేకుంటే దుష్ప్రభావాలను అనుభవించాల్సి వస్తుంది. మామిడిపండ్లతోపాటు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు ఎందుకంటే ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. మామిడిపండుతో కలిపి కొన్ని ఆహారాలను ఎప్పుడూ తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో తెలుసుకోండి..

మామిడితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు..

పెరుగు: పెరుగును మామిడిపండుతో కలిపి తినకూడదు.. మామిడిపండు, పెరుగు కలిపి తినడం వల్ల కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.

శీతల పానీయాలు: రాత్రి భోజనంలో మామిడిపండు తిన్నట్లయితే శీతల పానీయాలు తాగకండి. మామిడి, శీతల పానీయాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో పాటు జలుబు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

స్పైసీ ఫుడ్ : సాధారణంగా మామిడిపండ్లను రాత్రి భోజనంలో లేదా లంచ్‌లో తినడానికి ఇష్టపడతారు. మామిడిపండ్లు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్‌ను తినకూడదు.. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

చేదు పదార్థాలు: మామిడికాయతో కాకరకాయ తినకూడదు. మామిడికాయతో కాకరకాయ తింటే విషతుల్యం అవుతుందని, దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

పచ్చి మిరపకాయలు: పచ్చి మిరపకాయలను మామిడికాయలతో కలిపి తినకూడదు. అలాచేస్తే.. మామిడిపండ్లు తిన్న వెంటనే కడుపులో చికాకు కలిగే అవకాశముంది. దీనివల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.

నీళ్లు తాగొద్దు: మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు. తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి