AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే…ముందుగా ఏం చేయాలో తెలుసా..?

అలాంటి సమయంలో వెంటనే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలలో శ్వాసకోశ అరెస్ట్ కారణంగా మెదడుకు ఆక్సిజన్ అందదు. పిల్లల ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఈ సమయంలో ప్రథమ చికిత్స అందించడం తక్షణ అవసరం. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వివిధ పద్ధతులు ఉన్నాయి.

పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
Child Swallows A Coin
Jyothi Gadda
|

Updated on: May 06, 2024 | 12:45 PM

Share

చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదో మింగడం చాలా సార్లు జరుగుతుంది. దీని కారణంగా పిల్లల శ్వాస ఆగిపోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో వెంటనే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలలో శ్వాసకోశ అరెస్ట్ కారణంగా మెదడుకు ఆక్సిజన్ అందదు. పిల్లల ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఈ సమయంలో ప్రథమ చికిత్స అందించడం తక్షణ అవసరం. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వివిధ పద్ధతులు ఉన్నాయి.

పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే దాంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. గొంతులో ఆహారం, శ్వాస కోసం రెండు వేర్వేరు గొట్టాలు సమీపంలో ఉన్నాయి. గొంతులో ఏదైనా చిక్కుకున్నప్పుడు, అది శ్వాసనాళాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల ఊపిరాడకపోవటం మొదలవుతుంది.

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. మీ చేతి మీద పిల్లాడి కడుపు ఉండేలా వేసుకుని.. తల క్రిందికి వంచాలి. అప్పుడు వాడి వీపును కొద్దిగా బలంగా ఐదారుసార్లు కొట్టండి. పిల్లవాడు గాయపడేలా కాదు..ఇలా చేస్తే.. పిల్లల గొంతులో ఇరుక్కున్న వస్తువు బయటికి వస్తుంది. లేదా కాస్త బయటకు వచ్చినా అప్పుడు మీ వేలి సహాయంతో దాన్ని బయటకు తీయండి.

ఇవి కూడా చదవండి

ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. వాడిని నిటారుగా నిలబెట్టి.. కొద్దిగా ముందుకు వంచండి. ఆపై గొంతులో ఇరుక్కున్న వస్తువును బయటకు తీసేందుకు వీపుపై కొట్టండి. నోటిలో ఇరుక్కున్న వస్తు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇవన్నీ కేవలం ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు పాటించాల్సిన అత్యవసర చికిత్సగా మాత్రమే ప్రయత్నించాలి. ఇందులోని అంశాలు కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి..!తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..