Coriander Tea: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!

గత కొన్ని సంవత్సరాలుగా అనేక వ్యాధులకు మన పురాతన ఇంటి నివారణలను ప్రయత్నించే ధోరణి ప్రజల్లో బాగా పెరిగింది. ఇందులో భాగంగా మన ఆయుర్వేదంలో సూచించిన చెట్లు, మొక్కలు, మూలికలు, వంటింట్లో లభించే మసాలాల ఉపయోగలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇందులో ఇలాంటి గ్రీన్ లీఫ్ టీ కూడా ఒకటి. ఇది కొత్తిమీర ఆకులతో తయారు చేసిన ప్రత్యేకమేన టీ. దీని వినియోగంతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Coriander Tea: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
Coriander Tea
Follow us
Jyothi Gadda

|

Updated on: May 08, 2024 | 7:13 AM

చాలా మందికి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది ఉదయాన్నే పాలతో చేసిన టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ, కొందరు గ్రీన్ టీ తాగితే, మరికొందరు లెమన్ టీ లేదా బ్లాక్ టీ తాగుతుంటారు. అయితే, ఇక్కడ మనం మంచి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ఒక స్పెషల్ గ్రీన్‌ టీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కొత్తిమీర ఆకులతో తయారు చేసిన ప్రత్యేకమైన టీ. అవును మీరు చదివింది నిజమే. కొత్తిమీర ఆకులతో తయారు చేసిన టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కొత్తిమీర ఆకులు సాధారణంగా దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. కొత్తిమీరను అన్ని వంటల్లోనూ చివరగా వేస్తుంటారు. కొత్తమీరతో ప్రత్యేకించి చట్నీ కూడా తయారు చేస్తారు. ఇది ఆహారం రుచిని మరింతగా పెంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కొత్తిమీర ఆకులు లేకుండా ఏ వంటకం పూర్తి కాదనే చెప్పాలి. అలాంటి కొత్తిమీర కేవలం ఆహారం రుచి కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే, మీరు ఎప్పుడైనా కొత్తిమీరతో చేసిన టీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. డైటరీ ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల టీని రోజూ తాగితే కళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కొత్తిమీర ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో సహా అనేక మెదడు వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. దీని ఆకులను ఉడకబెట్టి టీ తయారు చేసి తాగడం వల్ల మెదడుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో కొత్తిమీర టీ కూడా బాగా సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. దీని కోసం మీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కొత్తిమీర ఆకులలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర ఆకులు నోటి దుర్వాసనను పోగొట్టడంలో సహాయపడతాయి. ఈ ఆకులతో చేసిన టీ నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా దంతాలు, చిగుళ్లను బలపరుస్తుంది. కొత్తిమీర ఆకుల టీ తాగడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మంలోని టాక్సిన్స్ ను తొలగించి శుభ్రపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

కొత్తిమీర ఆకుల టీ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం రక్తనాళాల టెన్షన్‌ని తగ్గించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..