AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menstrual Health: ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేశారో అసలుకే ఎసరు..

మహిళలు ఋతుస్రావం రోజుల్లో తీవ్ర శారీరక అసౌకర్యానికి గురవుతుంది. అధిక రక్తస్రావంతో పాటు పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి, కాళ్లు, వెన్నునొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరికి పీరియడ్స్ పెయిన్ మరింత తీవ్రంగా ఉండడం వల్ల కనీసం లేచి నిలబడలేని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు ఆ 5 రోజులలో మానసిక స్థితి కూడా సవ్యంగా ఉండదు. శరీరం కూడా బలహీనంగా ఉంది. దీని కారణంగా రోజువారీ కార్యకలాపాలకు..

Menstrual Health: ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేశారో అసలుకే ఎసరు..
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయాలా.. వద్దా..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారీ వ్యాయామం లేకుండా పీరియడ్ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. ఈ కాలంలో ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల పొత్తికడుపులో నొప్పి సంభవిస్తుంది. పీరియడ్స్ దుర్వాసనను నివారించడానికి చాలా మంది బాడీ డియోను ఉపయోగిస్తారు. కానీ ఇవి వినియోగించకూడదు. ఎందుకంటే ఈ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు యోనిలోని pH స్థాయిని తగ్గించి, స్కిన్ ఇరిటేషన్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తుంది.
Srilakshmi C
|

Updated on: May 07, 2024 | 9:23 PM

Share

మహిళలు ఋతుస్రావం రోజుల్లో తీవ్ర శారీరక అసౌకర్యానికి గురవుతుంది. అధిక రక్తస్రావంతో పాటు పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి, కాళ్లు, వెన్నునొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరికి పీరియడ్స్ పెయిన్ మరింత తీవ్రంగా ఉండడం వల్ల కనీసం లేచి నిలబడలేని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు ఆ 5 రోజులలో మానసిక స్థితి కూడా సవ్యంగా ఉండదు. శరీరం కూడా బలహీనంగా ఉంది. దీని కారణంగా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రతినెలా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటంతో మరింత విసుగు తెప్పిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుతుక్రమంలో శారీరక అసౌకర్యాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

  • రుతుక్రమం వచ్చే రోజుల్లో ఆహారం సక్రమంగా తీసుకోవాలి. అయితే ఈ సమయంలో వేయించిన ఆహారం, అధిక ఉప్పు ఉండే చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. ఇటువంటి ఆహారాలు శరీరంలో నీరు నిలుపుదలకి కారణమవుతాయి. దీంతో శరీరం చాలా బరువుగా అనిపించి, అసౌకర్యం పెరుగుతుంది.
  • పీరియడ్స్‌ సమయంలో వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఇది అస్సలు మంచిది కాదు. బదులుగా ఋతుస్రావం సమయంలో శారీరక అసౌకర్యం, నొప్పిని తగ్గించడానికి యోగా ఉత్తమ మార్గం. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వేసుకునే బదులు తేలికపాటి వ్యాయామం చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగని భారీ వ్యాయామం చేయకూడదు.
  • పీరియడ్స్‌ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా మానసిక స్థితి చికాకుగా మారుతుంది. దీంతొ స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది. కానీ ఈ సమయంలో చక్కెర ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం ప్రమాదకరం. స్వీట్లు తినాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.
  • పీరియడ్స్‌ రోజుల్లో టీ, ఆల్కహాల్ తాగడం మానుకోవాలి. టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కూడా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో ఎక్కువ అలసటకు దారితీస్తుంది. తలనొప్పి రావచ్చు.
  • పీరియడ్స్‌ సమయంలో పాలు లేదా పాల ఉత్పత్తులను నివారించాలి. ఇవి గ్యాస్, గుండెల్లో మంట, కడుపు నొప్పి సమస్యను పెంచుతాయి. కొన్నిసార్లు ఇది మలబద్ధకం సమస్యను కూడా పెంచుతుంది. బహిష్టు సమయంలో తేలికపాటి, పౌష్టికాహారం తీసుకోవాలి.
  • రాత్రిపూట మేల్కొనే అలవాటు ఉంటే, పీరియడ్స్ సమయంలో ఈ అలవాటుకు దూరంగా ఉండాలి. నిద్రలేమి సమస్యలు మరింత డిప్రెషన్‌కు కారణమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం. ఇది శారీరక అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.