AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024: ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు.. నాలుగు కేంద్రాల్లోని సామాగ్రి దగ్ధం

బస్సులో ఆరు పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు, ఓటింగ్‌ మెటీరియల్‌తో బృందం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు దిగలేకుండా.. బస్సు డోర్‌ ముందు వైపు తలుపు తాళం వేసి ఉండడంతో వెనుక డోర్, కిటికీ పగలగొట్టి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగినట్టు కలెక్టర్

Lok Sabha Election 2024: ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు.. నాలుగు కేంద్రాల్లోని సామాగ్రి దగ్ధం
Fire Breaks Out
Jyothi Gadda
|

Updated on: May 08, 2024 | 8:44 AM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హవా వీస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ముగిసింది. ఈ క్రమంలోనే పోలింగ్‌ సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో పోలింగ్‌ అధికారులు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో కొన్ని ఈవీఎంలు దెబ్బతిన్నాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు. జిల్లాలోని గోల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో బేతుల్ జిల్లాలోని ముల్తాయ్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గౌలా గ్రామ సమీపంలో ఆరు పోలింగ్ స్టేషన్ల నుండి పోలింగ్‌ సామాగ్రితో బేతుల్‌కు తిరిగి వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపివేయడంతో పోలింగ్ సిబ్బంది ఎలాగోలా బస్సు నుంచి దూకి వారి ప్రాణాలను కాపాడుకోగలిగారు. బస్సు గేర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టుగా తెలిసింది.

బస్సులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్‌ బస్సును ఆపేశాడు. ఇంతలో బస్సు గేర్ బాక్స్ లో మంటలు చెలరేగాయి. బెతుల్ జిల్లా ముల్తాయ్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని గౌలా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సులో ఆరు పోలింగ్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు, ఓటింగ్‌ మెటీరియల్‌తో బృందం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు దిగలేకుండా.. బస్సు డోర్‌ ముందు వైపు తలుపు తాళం వేసి ఉండడంతో వెనుక డోర్, కిటికీ పగలగొట్టి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగినట్టు కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

నాలుగు కేంద్రాల్లోని పోలింగ్‌ సామాగ్రి దగ్ధం..

275 రాజాపూర్, 276 దూదర్, 277 గెహుబర్సా, 278 వీట్ బర్సా నంబర్ 2, 279 కుందరాయత్ మరియు 280 చిఖ్లీ మాల్ నుండి పోలింగ్ సిబ్బందితో సహా బస్సులో పోలింగ్ సామాగ్రి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా రెండు పోలింగ్‌ కేంద్రాల్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధం కాగా, నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోని కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..