AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: ఆధార్ ఉచిత అప్‌డేట్‌ని ఎప్పటి వరకు పొడిగింపు ఉందో తెలుసా?

దేశంలోని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు మీ గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్‌లో మీ వ్యక్తిగత, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీరు గత కొన్నేళ్లుగా మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయకుంటే ఇప్పుడు దాన్ని ఉచితంగా..

Aadhaar Update: ఆధార్ ఉచిత అప్‌డేట్‌ని ఎప్పటి వరకు పొడిగింపు ఉందో తెలుసా?
Aadhaar Card
Subhash Goud
|

Updated on: May 08, 2024 | 2:41 PM

Share

దేశంలోని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు మీ గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ కార్డ్‌లో మీ వ్యక్తిగత, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీరు గత కొన్నేళ్లుగా మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయకుంటే ఇప్పుడు దాన్ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

అయితే ఆధార్ కార్డులో ఎలాంటి మార్పు చేయాలన్నా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో చిరునామా, మొబైల్ నంబర్ మార్చుకోవడానికి రూ.50 ఫీజు చెల్లించాలి. అదేవిధంగా ఇతర మార్పులు చేయడానికి కూడా మీరు రుసుము చెల్లించాలి.

ఉచిత అప్‌డేట్‌ తేదీ పొడిగింపు

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గడువును పొడిగించింది. ఇప్పుడు ఆధార్ కార్డ్ హోల్డర్లు జూన్ 14 వరకు ఎటువంటి రుసుము చెల్లించకుండా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు అప్‌డేట్‌ కోసం రుసుము చెల్లించాలి. ఎలాంటి నకిలీలు, మోసపూరిత కార్యకలాపాలను నివారించడానికి, వినియోగదారులు తమ ఆధార్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో గుర్తింపు కోసం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ కార్డ్ దాదాపు తప్పనిసరి.

ఆధార్‌ను ఎవరు అప్‌డేట్ చేయాలి?

ఆధార్ అప్‌డేట్, ఎన్‌రోల్ రెగ్యులేషన్ 2016 ప్రకారం.. ప్రతి ఒక్కరు ఆధార్‌ తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాలి. గుర్తింపు రుజువు, చిరునామాను అప్‌డేట్ చేయాలి. బ్లూ ఆధార్ కార్డు ఉన్న వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ ఆధార్‌ అందిస్తారు. ఆధార్ ఉన్నవారు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, ఇతర అప్‌డేట్ చేయవచ్చు.

ఈ విధంగా ఆధార్ ఎక్కడ ఉపయోగించబడుతుందో తనిఖీ చేయండి

ముందుగా https://uidai.gov.in/కి వెళ్లి, My Aadhaar డ్రాప్ డౌన్ కింద కనిపించే ‘Aadhaar Services’పై క్లిక్ చేయండి. ఆధార్ సర్వీసెస్‌లో అథెంటికేషన్ హిస్టరీకి వెళ్లండి. ఇక్కడ ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి. మీ నంబర్‌కు OTP వస్తుంది. దీన్ని నమోదు చేసిన తర్వాత, ప్రమాణీకరణ రకం తదుపరి పేజీలో కనిపిస్తుంది. ఇందులో అన్నీ ఎంచుకోండి. ఇది జనాభా, బయోమెట్రిక్ ప్రమాణీకరణ చరిత్ర కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని నెలల పాట తనిఖీ చేయాలనుకుంటున్నారో తేదీ పరిధిని ఎంచుకోవచ్చు. గత 6 నెలల ఆధార్ చరిత్రను చూడవచ్చు.మీరు దీన్ని PDFలో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం, పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్‌లో రాసి, తరువాత పుట్టిన సంవత్సరాన్ని రాయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి