Viral Video: ‘హలో అది మెట్రో ట్రైన్.. మీ బెడ్‌రూమ్ కాదు..’ వీడియోపై మీ కామెంట్..?
ఈ వీడియో ప్రజంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వీడియో షేర్ చేసిన పర్సన్ వారిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఆ క్లిప్‌లో మాత్రం అలా ఏం కనిపించలేదు. దీంతో వీడియోను షేర్ చేసిన వ్యక్తినే తిట్టి పోస్తున్నారు నెటిజన్లు.
ఈ మధ్య కొందరు పబ్లిక్ ప్లేసుల్లో కనీసం సోయి లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా రొమాన్స్‌లోకి దిగిపోతున్నారు. గతంలో పార్కుల్లో ఈ తరహా వేషాలు వేసేవారు. ఇప్పుడు ఏకంగా మెట్రో ట్రైనుల్లో అందరూ చూస్తుండగానే హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కోచ్‌లలో జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు మెట్రో వంతు వచ్చింది. మెట్రో రైలు ఆటోమేటెడ్ డోర్‌ల దగ్గర ఒక యువ జంట అత్యంత సన్నిహితంగా మెదులుతున్న వీడియో తాజాగా ట్రెండ్ అవుతోంది. “బెంగళూరు మెట్రో.. ఏం జరుగుతోంది..? మన మెట్రో కూడా ఢిల్లీలా మారుతోంది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అతడ్ని కిస్ చేసేసింది. దయచేసి వారిపై చర్యలు తీసుకోండి” అని ఓ ఎక్స్ యూజర్ ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌లో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు.
వీడియో :
Hey @OfficialBMRCL @NammaMetro_ @BlrCityPolice what happening in Namma metro slowly Bangalore metro are turning into Delhi metro Take some action on themThe girl was literally kissing the boy pic.twitter.com/p3pdi2vM7I
— KPSB 52 (@Sam459om) May 5, 2024
ఎక్స్ యూజర్ కంప్లైంట్‌ను నోట్ చేసుకున్నట్లు చెబుతూ బెంగళూరు పోలీసులు రెస్సాండ్ అయ్యారు. ఫోన్ నంబర్ డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరారు.
క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది యూజర్స్ ఆ జంటపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, బహిరంగ ప్రదేశాల్లో కాస్త సోయితో ప్రవర్తించాలని కోరుతున్నారు. మరికొందరు “వారి అనుమతి లేకుండా వీడియో ఎలా షూట్ చేస్తారు.. అయినా వారు ముద్దు పెట్టుకున్నట్లు వీడియోలో ఏం లేదు. కావాలని హడావిడి చేయకండి” అని పేర్కొంటున్నారు.
”నాకు ముద్దు పెట్టుకోవడం వీడియోలో కనిపించడం లేదు. కేవలం హగ్ చేసుకున్నారు. అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం. అనుమతి లేకుండా వారిని చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మీపై చర్యలు తీసుకోవాలి’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..