Viral Video: ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా.. బంగ్లా స్టార్ ప్లేయర్‌పై నెటిజన్ల ఫైర్..
Shakib Al Hasan Viral Video: ఇప్పటి వరకు అభిమానులతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. షకీబ్ కోపం ఎంతగా ఉందంటే, చాలాసార్లు హద్దులు దాటుతుండడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. అభిమానులతో పాటు, తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో అతను అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో షకీబ్ మరోసారి ఓ అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో తెగ వైరలవుతోంది.
Shakib Al Hasan Misbehaves With Fan: క్రికెట్‌లో ఆటగాళ్ళు తరచుగా మైదానంలో దూకుడుగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి నిగ్రహాన్ని కోల్పోతుంటారు. కానీ, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాదు బయట కూడా తరచుగా కోపంగా కనిపిస్తుంటాడు. ఇప్పటి వరకు అభిమానులతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. షకీబ్ కోపం ఎంతగా ఉందంటే, చాలాసార్లు హద్దులు దాటుతుండడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. అభిమానులతో పాటు, తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో అతను అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో షకీబ్ మరోసారి ఓ అభిమానితో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో తెగ వైరలవుతోంది.
అభిమాని మెడ పట్టుకుకుని నెట్టేసి, చేయి పైకి లేపిన షకీబ్..
తాజాగా ఓ అభిమానిపై షకీబ్ కోపం ప్రదర్శించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అభిమాని అతనితో సెల్ఫీ దిగాలని పట్టుబట్టడంతో షకీబ్‌కి కోపం వచ్చింది. షకీబ్ ఆ అభిమానిని పదే పదే వద్దని వారించాడు. కానీ, అభిమాని అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో షకీబ్ అభిమాని మెడ పట్టుకున్నాడు. ఆ తర్వాత షకీబ్ ఫ్యాన్‌ని తోసేసి ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టేందుకు చేయి పైకెత్తాడు.
అమెరికాను ఢీ కొట్టేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్..
Shakib al Hasan 🇧🇩🏏 went to beat a fan who tried to take a selfie 🤳
Your thoughts on this 👇👇👇 pic.twitter.com/k0uVppVjQw
— Fourth Umpire (@UmpireFourth) May 7, 2024
2024 టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పూర్తి సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇటువంటి పరిస్థితిలో, బోర్డు 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. దీంతో ఢాకాలో జరిగిన ప్రపంచ కప్ ప్రాక్టీస్ గురించి షకీబ్ మాట్లాడుతూ, గత ప్రపంచ కప్‌లో మేం మా పరిస్థితిని సమీక్షించుకుని, ఓ బెంచ్‌మార్క్ పెట్టుకుని ఈ ప్రపంచకప్‌లో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. తొలి రౌండ్‌లో మూడు మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నాం. మా ప్రాక్టీస్ చాలా బాగుందని తెలిపాడు.
T20 ప్రపంచ కప్ 2024కి బయలుదేరే ముందు బంగ్లాదేశ్ జట్టు 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడనుంది. దీంతో పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జట్టుకు మేలు జరుగుతుందని షకీబ్ అన్నాడు. అమెరికాతో ఆడితే వారి పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుందని షకీబ్ అన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మా జట్టు నుంచి ఎవరూ అమెరికాలో ఆడలేదని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..