Earthquake: గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు.. భయాందోళనకు గురైన ప్రజలు

ఇదిలా ఉంటే, 2001జనవరి 26 న గుజరాత్‌లోని కచ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై 7.7 తీవ్రతగా నమోదైంది. అప్పటి భూకంపం ధాటికి సుమారు 13 వేల 800 మంది మరణించగా, 1.67 లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. గత రెండు శతాబ్దాలలో భారతదేశంలో సంభవించిన మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసక భూకంపం ఇదేనని అధికారులు వెల్లడించారు.

Earthquake: గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం.. నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు.. భయాందోళనకు గురైన ప్రజలు
Earthquake
Follow us

|

Updated on: May 09, 2024 | 7:03 AM

గుజరాత్‌లోని సౌరాష్ట్రలో భూకంపం సంభవించింది. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 3:18 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.4గా నమోదైనట్లు గుజరాత్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. సౌరాష్ట్రలోని తలాలాకు ఉత్తర-ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టుగా వెల్లడించారు. దీని వెంటనే మరోమారు 3.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

మొదటిసారి భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.4 తీవ్రతో నమోదు కాగా, రెండోసారి 3.7 గా నమోదైనట్లుగా గుజరాత్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, 2001జనవరి 26 న గుజరాత్‌లోని కచ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై 7.7 తీవ్రతగా నమోదైంది. అప్పటి భూకంపం ధాటికి సుమారు 13 వేల 800 మంది మరణించగా, 1.67 లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. గత రెండు శతాబ్దాలలో భారతదేశంలో సంభవించిన మూడవ అతిపెద్ద, రెండవ అత్యంత విధ్వంసక భూకంపం ఇదేనని అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..