AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేపీ నడ్డాకి సమన్లు.. సెంట్రల్ వర్సెస్ స్టేట్ వార్‎లో భాగమా..?

జేపీ నడ్డాకు సమన్లు పంపారు బెంగళూరు పోలీసులు. మే5న బీజేపీ ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ముస్లింలకు ఆ ట్వీట్‌ వ్యతిరేకంగా ఉందంటూ బెంగళూరు పోలీసులు.. ట్విట్టర్‌ ఎక్స్‌కు తెలిపారు. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరారు. అంతేకాదు.. అదేరోజు ట్వీట్‌ మీద విచారణకు ఆదేశించింది డీజీపీ ఆఫీస్‌. దీంతో బెంగళూరు లోని హై గ్రౌండ్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

జేపీ నడ్డాకి సమన్లు.. సెంట్రల్ వర్సెస్ స్టేట్ వార్‎లో భాగమా..?
Jp Nadda
Srikar T
|

Updated on: May 09, 2024 | 7:30 AM

Share

జేపీ నడ్డాకు సమన్లు పంపారు బెంగళూరు పోలీసులు. మే5న బీజేపీ ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ముస్లింలకు ఆ ట్వీట్‌ వ్యతిరేకంగా ఉందంటూ బెంగళూరు పోలీసులు.. ట్విట్టర్‌ ఎక్స్‌కు తెలిపారు. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరారు. అంతేకాదు.. అదేరోజు ట్వీట్‌ మీద విచారణకు ఆదేశించింది డీజీపీ ఆఫీస్‌. దీంతో బెంగళూరు లోని హై గ్రౌండ్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అంతేకాదు.. ముస్లింలకు వ్యతిరేతకంగా ఉన్న ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు, బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాళవియా, బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ బీవై విజయేంద్రకు సమన్లు జారీచేశారు బెంగళూరు పోలీసులు. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

అసలు బెంగళూరు పోలీసులు నడ్డాకు సమన్లు జారీ ఎందుకు చేశారు? ఇది కాంగ్రెస్‌ స్టేట్స్‌ వార్‌గా మారిందా? ఆ మధ్య బీజేపీ జాతీయ నేత.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే.. దేశంలో ఉన్న రిజర్వేషన్లు అన్నీ తొలగిస్తాం అన్న విధంగా మార్ఫింగ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి ఆ పోస్టు రావడంతో సీఎం రేవంత్‌, తెలంగాణ సోషల్‌ మీడియా టీమ్‌పై బీజేపీ ఫిర్యాదుమేరకు కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు. అంతేకాదు రేవంత్‌ తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనికి ప్రతిగానే ఇప్పుడు నడ్డాపై కేసు పెట్టారంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ.. అటూ, ఇటూ మార్ఫింగ్‌ వీడియోలు పోస్టు చేయడం వల్లే ఇరుక్కున్నారు. మొదట బీజేపీ కేసు పెడితే.. ఆతర్వాత కాంగ్రెస్‌ రివేంజ్‌ కేసు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సోషల్‌ మీడియా వార్‌ ఇప్పుడు పోలీస్‌ వార్‌గా మారింది. బీజేపీ ఢిల్లీ పోలీసుల ద్వారా రేవంత్‌పై కేసు పెడితే.. ఇప్పుడు బెంగళూరు పోలీసుల ద్వారా బీజేపీ చీఫ్‌ పైనే కేసు పెట్టింది కాంగ్రెస్‌. ఈ వార్‌ ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్