Instant Vada: పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
వడలు అంటే చాలా మందికి ఇష్టం. వేడి వేడి గారెల్లో నాటు కోడి కూర వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. వడలను టిఫిన్‌గా, డిన్నర్‌గా ఎలాగైనా తినొచ్చు. వడలను చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. అయితే వడలు తినాలంటే.. పప్పు నాబెట్టి.. రుబ్బి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కాస్త కష్టమైన పనిగానే చెప్పొచ్చు. అప్పటికప్పుడు వడలు తినాలంటే కష్టం. కానీ ఇప్పుడు ఈ ట్రిప్స్ పాటిస్తే.. అప్పటికప్పుడు వడలను తినొచ్చు. ఇది చేసుకోవడం కూడా సింపుల్..

వడలు అంటే చాలా మందికి ఇష్టం. వేడి వేడి గారెల్లో నాటు కోడి కూర వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. వడలను టిఫిన్‌గా, డిన్నర్‌గా ఎలాగైనా తినొచ్చు. వడలను చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. అయితే వడలు తినాలంటే.. పప్పు నాబెట్టి.. రుబ్బి ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కాస్త కష్టమైన పనిగానే చెప్పొచ్చు. అప్పటికప్పుడు వడలు తినాలంటే కష్టం. కానీ ఇప్పుడు ఈ ట్రిప్స్ పాటిస్తే.. అప్పటికప్పుడు వడలను తినొచ్చు. ఇది చేసుకోవడం కూడా సింపుల్ ప్రాసెస్. ఓ పావుగంటలో వేడి వేడి గారెలు తయారు చేసుకోవచ్చు. మరి గారెలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇన్ స్టెంట్ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి, పెరుగు, ఉప్పు, నిమ్మ రసం, ధనియాల పొడి, మిరియాల పొడి, నీళ్లు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తి మీర, ఆయిల్.
ఇన్ స్టెంట్ గారెలు తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లోకి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, నిమ్మ రసం వేసి నీళ్లు వేసి.. ఉండలు లేకుండా కలుపు కోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత.. బియ్యం పిండి మిశ్రమాన్ని కూడా వేసి.. చిన్న మంటపై చపాతీ పిండిలా దగ్గర అయ్యేంత వరకూ ఉడికించాలి.
మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కొద్దిగా చల్లార నివ్వాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు చల్లారిన పిండిని.. కొద్ది కొద్దిగా తీసుకుంటూ.. గారెల్లా వత్తుకుని ఆయిల్ లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టెంట్ గారెలు సిద్ధం.