AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Travel: అయోధ్య, లక్షద్వీప్‌ సహా వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..

పర్యాటకులు ఏ ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని తమ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసినవాటిలో గోవా మొదటి ప్లేస్ లో ఉన్నా.. అయోధ్య, లక్షద్వీప్‌, నందీహిల్స్‌ వంటివి దేశీయ పర్యాటక గమ్య స్థానాల్లో ప్రధాన ఎంపికగా నిల్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలం మార్చి- ఏప్రిల్‌తో పోల్చితే 2024 ఏడాదిలో మార్చి-ఏప్రిల్ డేటా ఆధారంగా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతను బట్టి రూపొందించిన నివేదికను ఈ సంస్థ రిలీజ్ చేసింది. 

Summer Travel: అయోధ్య, లక్షద్వీప్‌ సహా వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..
Summer Travel Places
Surya Kala
|

Updated on: May 09, 2024 | 9:27 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ఎక్కువ మంది భావిస్తారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తమ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో విహార యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. ఇందు కోసం దేశంలోని అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శించాడనికి ఆసక్తిని చూపిస్తారు. తమ బడ్జెట్ కు తగిన ప్రదేశాలను ఎంచుకుని వేసవి విడిదిగా తమకు నచ్చిన పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు. ఈ మేరకు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఫ్యామిలీ ట్రావెల్ సెగ్మెంట్ పర్యటక రంగం 2023 కంటే ఈ ఏడాది ఫ్యామిలీ ట్రావెల్ సెగ్మెంట్ 20 శాతం పెరిగిందని అదే సమయంలో సింగిల్ పర్యాటకుల సంఖ్య కూడా 10 శాతం పెరిగిందని MakeMyTrip ప్రకటించింది.

పర్యాటకులు ఏ ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని తమ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేసినవాటిలో గోవా మొదటి ప్లేస్ లో ఉన్నా.. అయోధ్య, లక్షద్వీప్‌, నందీహిల్స్‌ వంటివి దేశీయ పర్యాటక గమ్య స్థానాల్లో ప్రధాన ఎంపికగా నిల్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలం మార్చి- ఏప్రిల్‌తో పోల్చితే 2024 ఏడాదిలో మార్చి-ఏప్రిల్ డేటా ఆధారంగా భారతీయ పర్యాటకుల ప్రాధాన్యతను బట్టి రూపొందించిన నివేదికను ఈ సంస్థ రిలీజ్ చేసింది.

తీర్ధయాత్రల్లో వేసవిలో ఎక్కువ మంది పూరి, వారణాసి క్షేత్రాలను సెర్చ్ చేసిన వారి సంఖ్య ఉన్నప్పటికీ.. అయోధ్యను సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని .. దీనికి సంబంధించిన వాల్యూమ్‌లలో వృద్ధిని నమోదు చేస్తూనే ఉందనే ట్రెండ్‌లు చూపించాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మేక్‌మైట్రిప్ విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్ ప్రకారం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో లక్సెంబర్గ్, లంకావి,  అంటాల్యాలు ఉన్నపటికీ … ప్రయాణీకుల ఆసక్తిని చూపిస్తున్న ప్రాంతాల్లో  బాకు, అల్మాటీ, నగోయాలు కూడా ఉన్నాయి. మేక్‌మైట్రిప్ కో-ఫౌండర్, గ్రూప్ సిఇఒ రాజేష్ మాగో మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో సెర్చ్ చేసిన పర్యటక ప్రాంతాలు గత ఏడాది కంటే బాగా పెరిగాయని చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..