Variety Mango: జపాన్ మియాజాకికి భారత్‌లో మియాజ్కి ఒక్కటేనా.. అరుదైన మామిడి జాతి గురించి తెలుసుకోండి..

మియాజాకి మామిడి పండ్లను తమకు అత్యంత ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తారు. ఈ మామిడి భారతీయ రకం కాదు. జపాన్‌లోని క్యుషు ప్రాంతంలోని మియాజాకి పట్టణంలో దీనిని అభివృద్ధి చేశారు. 1980ల్లో స్థానిక రైతుల సహకారంతో మియాజాకి యూనివర్సిటీ పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసిందని నమ్ముతారు. అయితే జపాన్ లో ఇతర నివేదికల ప్రకారం 1870లో మీజీ కాలంలో ఉన్నట్లు జపాన్ చరిత్రలో పేర్కొన్నారు. 

Variety Mango: జపాన్ మియాజాకికి భారత్‌లో మియాజ్కి ఒక్కటేనా.. అరుదైన మామిడి జాతి గురించి తెలుసుకోండి..
పండిన మామిడిపండ్లు రుచిలోనూ, వాసనలోనూ అమోఘంగా ఉంటాయి. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. పండిన మామిడి పండ్లలో రుచితో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దానితో పాటు పండిన మామిడిలో బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2024 | 11:23 AM

వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే మార్కెట్లు అన్ని రకాల మామిడికాయలతో నిండిపోయాయి. భారతదేశంలో అనేక రకాల మామిడి పండ్లకు నిలయం. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రకారం భారతదేశంలో ప్రతి వేసవిలో 1500 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే మన దేశంలో చాలా అరుదుగా కనిపించే వెరైటీ ఒకటి ఉంది. దీనిని మియాజాకి మామిడి అని పిలుస్తారు. ఇది వాస్తవానికి జపాన్‌కు చెందినది. అంతేకాదు మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి జాతిగా పేరుపొందింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఖరీదైంది

ఈ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.2.75 నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది. మామిడి పండ్లను పండ్ల రాజు అని పిలుస్తారు. మియాజాకి మామిడి పండ్లను తమకు అత్యంత ఇష్టమైన వారికి బహుమతిగా ఇస్తారు.

ఈ మామిడి భారతీయ రకం కాదు. జపాన్‌లోని క్యుషు ప్రాంతంలోని మియాజాకి పట్టణంలో దీనిని అభివృద్ధి చేశారు. 1980ల్లో స్థానిక రైతుల సహకారంతో మియాజాకి యూనివర్సిటీ పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసిందని నమ్ముతారు. అయితే జపాన్ లో ఇతర నివేదికల ప్రకారం 1870లో మీజీ కాలంలో ఉన్నట్లు జపాన్ చరిత్రలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సూర్యుని గుడ్లు

జపాన్‌లో దీనిని తైయో-నో-తమగో అంటారు. అంటే సూర్యుని గుడ్డు అని అర్ధం. ప్రకాశవంతమైన రంగు,  తెగుళ్లు లేదా కీటకాల బారిన పడకుండా చాలా కాలం పాటు ఉండే సామర్థ్యం కారణంగా దీనికి ఈ పేరు పెట్టారు. మామిడి వయస్సు ప్రకారం రంగు ఊదా నుంచి ప్రకాశవంతమైన ఎరుపుకు మారుతుంది. అంటే  ఊదారంగు మామిడిగా మొదలవుతుంది …  పక్వానికి వచ్చేసరికి ఎర్రగా మారుతుంది. ఒక మామిడి 350 గ్రాముల బరువు ఉంటుంది. ఏప్రిల్, ఆగస్టు మధ్యకాలంలో ఈ మామిడి లభిస్తుంది.

భారతదేశంలో మియాజాకి మామిడిని మొదట ఒడిశా, బీహార్‌లో కొంతమంది రైతులు పండించారు. వారు జపాన్ నుండి మొక్కలు దిగుమతి చేసుకున్నారు.అయితే దీని అధిక ధర కారణంగా.. కొనేవారు తక్కువ.  ఇంట్లో పండించే మియాజాకీకి మొదట్లో కిలో రూ.10,000 ధర పలికింది. తరువాత మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలలోని తోటల యజమానులు కూడా ఈ మామిడిని పండించడం ప్రారంభించారు. ధరలు తగ్గాయి. అయితే ఇండియన్ వెరైటీకి అసలు జపనీస్ రకానికి చెందిన టేస్ట్ , టెక్స్చర్ ఉండవని కొందరు అంటున్నారు.

గత సంవత్సరం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్‌లో మియాజాకి మామిడి పండ్లు చాలా మంచి పరిమాణంలో అమ్ముడయ్యాయి. కానీ మియాజాకి మామిడి పండించే రైతులు మాత్రం సెక్యూరిటీ గార్డులు, కుక్కలు, సీసీ కెమెరాల సాయంతో తోటలను కాపాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే  దొంగలు బహుశా ఈ ఖరీదైన సూర్యుని గుడ్లను దొంగిలించడానికి రెడీగా ఉంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌