- Telugu News Photo Gallery Many Medicinal Properties Of Ponnanganti Kura Reduce Weight And Boost Immunity Telugu Lifestyle News
Ponnaganti kura : పోషకాల పొన్నగంటి కూర ! ఈ ఆకుకూరలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ప్రకృతిలో చాలా రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలేడు. అలాంటి వాటిలో అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆకు కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకు కూర లో బీటా కెరోటిన్, ఐరన్,ఫైబర్, క్యాలిష్యం, విటమిన్ ఎ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.
Updated on: May 09, 2024 | 11:10 AM

Ponnaganti Kura- పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే ఎంతో రుచిగా వుంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Ponnaganti Kura -ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని కూడా తినొచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

Ponnaganti Kura -ఈ ఆకును మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాస్తే మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.

Ponnaganti Kura -ఇందులో ఉండే పోషక విలువలు.. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా పొన్నగంటి కూర శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసి, జీర్ణ శక్తిని పెంచుతుంది. ఈ కూర తినే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, చూపును మెరుగుపరచడానికి కూడా పొన్నగంటి కూర మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు వైరల్ ఇన్ ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. జీవక్రియలో ఉండే లోపాలను తొలగిస్తుంది.

Ponnaganti Kura -పొన్నగంటి కూరను తినడం వల్ల పైత్యం, జ్వరం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మవ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా వీర్య కణాల సమస్యతో బాధపడుతున్న వారికి ఔషధంగా పని చేస్తుంది. దీని కోసం రోజూ ఒక టీ స్పూన్ ఈ ఆకు రసం తీసుకుని.. వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలు నయమవుతాయి.





























