పొరపాటున కూడా ఈ ఐదు విషయాలు ఎవరికీ చెప్పకండి.. మీ పురోభివృద్ధి ఆగిపోతుంది..
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విధానంలో చెప్పిన విషయాలను పాటిస్తే ప్రగతి మెట్లు సులభంగా అధిరోహించవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సమాజంలో గౌరవం పొందవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా తన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పురుషులు కుటుంబ వివాదాలు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా బయటి వ్యక్తులకు చెప్పకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అంతేకాదు భార్యపై కోపం వచ్చినప్పుడు, ఆమె స్వభావం, ప్రవర్తన లేదా అలవాట్ల గురించి ఎవరికీ చెప్పకండి
ఎవరి జీవితంలోనైనా సరే విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎదుటి వ్యక్తులు మీకు ఎంత ప్రత్యేకమైన వారు అయినా సరే.. అంటే చివరకు మీ జీవిత భాగస్వామికి కూడా చెప్పకూడదు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విధానంలో చెప్పిన విషయాలను పాటిస్తే ప్రగతి మెట్లు సులభంగా అధిరోహించవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. సమాజంలో గౌరవం పొందవచ్చు. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా తన గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఏ విషయాలు ఎవరికీ చెప్పకూడదంటే
పురుషులు కుటుంబ వివాదాలు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా బయటి వ్యక్తులకు చెప్పకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అంతేకాదు భార్యపై కోపం వచ్చినప్పుడు, ఆమె స్వభావం, ప్రవర్తన లేదా అలవాట్ల గురించి ఎవరికీ చెప్పకండి. ఈ విషయాలను మరొక వ్యక్తితో పంచుకుంటే..వారు ఆ సమయంలో పట్టించుకోకపోవచ్చు,.. తర్వాత ఏదైనా పరిణామాలు జరిగినప్పుడు మీరు చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు.
ఈ విషయాలను కూడా గోప్యంగా ఉంచండి
జీవితంలో మీకు ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే సరదాగా కూడా ఎవరితోనైనా ఆ విషయాలను చెప్పకూడదు. సాధారణంగా ఇలాంటి విషయాలను తమ సన్నిహితులతో సరదాగా చెబుతుంటారు. అయితే ఇలాంటి విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. అందువల్ల మీకు ఎప్పుడైనా అవమానకరమైన సంఘటనలు ఎదురైతే వాటిని మనసులో దాచుకోవాలి.
డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి
సంపాదించిన డబ్బు మిమ్మల్ని సామర్థ్యమైన వ్యక్తిగా చూపిస్తుంది. నేటి కాలంలో డబ్బు ప్రతి వ్యక్తికి ఒక శక్తి. అందువల్ల ఆర్థిక పరిస్థితి లేదా డబ్బు సంబంధిత సమస్యలను ఎవరికీ చెప్పకండి. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. డబ్బు కొరత ఉందని ఇతరులకు తెలియగానే వారు కూడా మీకు దూరంగా ఉంటారు. కనుక మీ ఆదాయాన్ని ఇతరులకు చెప్పరాదు. అదే విధంగా మీ ఆర్ధిక ఇబ్బందులను తెలియజేయరాడు.
గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు
యోగా గురువు దగ్గర దీక్ష తీసుకున్నట్లయితే ఆ గురువు చెప్పిన గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు. గురుమంత్రంలో చాలా రకాలు ఉన్నాయి. జీవితంలో ఒకరి నుంచి మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటే అది కూడా గురుమంత్రం లాంటిదే. అందుకే నీ గురుమంత్రాన్ని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే అవసరమైనప్పుడు, ఈ గురు మంత్రాలు మాత్రమే మీకు సహాయపడతాయి. మీకు జీవితంలో విజయాన్ని అందిస్తాయి.
విరాళాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచండి
జీవితంలో మీరు ఏ దానం చేసినా దానిని రహస్యంగా ఉంచాలి. ఆ దానం గురించి ఎవరికీ చెప్పకూడదు. అటువంటి రహస్య దానాల వలన జీవితంలో విజయాన్ని పొందుతారు. పురోగతికి మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరికైనా మీరు చేసిన దానం గురించి చెబితే అప్పుడు పుణ్యం లభించదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు