06 April 2024
TV9 Telugu
Pic credit - Pixabay/Instagram
ప్రపంచమంతటా అనేక నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులు చిన్నవిగా ఉంటే.. మరి కొన్ని నదులు ఒక చోట పుట్టి.. ఇతర దేశాలలోకి కూడా ప్రవహిస్తాయి.
సాధారణంగా నదులు అందంగా కనిపిస్తాయి. అయితే ప్రపంచంలో ఒక నది ఉంది. దీనిలోని నీరు అనేక రంగులలో ఇంద్రధనస్సులా కనిపిస్తుంది.
ఈ ప్రత్యేకమైన నది కొలంబియాలో ఉంది, దీనిని 'రెయిన్‌బో రివర్' లేదా 'ఈడెన్ గార్డెన్ అంటే 'గార్డెన్ ఆఫ్ ది గాడ్స్' అని కూడా పిలుస్తారు
ఈ నది పేరు కానో క్రిస్టేల్స్. ఈ నదిలో నీరు ఆకుపచ్చ, నీలం, పసుపు, నలుపు, ఎరుపుతో సహా ఐదు వేర్వేరు రంగులలో కనిపిస్తుంది.
అయితే జూలై నుంచి నవంబర్ వరకు మాత్రమే నది నీరు ఐదు రంగుల్లో కనిపిస్తుంది. అందుకే ఈ నెలల్లో చాలా మంది ఈ నదిని చూడానికి ఇక్కడికి వస్తుంటారు.
నది ఉపరితలంలో మాసిరినియా క్లావిగెరా అనే మొక్క ఉందని, సూర్యకాంతితో అది ఎర్రగా మారుతుందని, అందుకే నీరు ఎర్రగా కనిపిస్తుందని చెబుతారు.
అంతేకాదు కాదు నదిలో నల్లని రాళ్లు, పసుపు రంగు మొక్కలు, ఆకుపచ్చ ఇసుక కూడా ఉన్నాయి. ఈ కారణంగానే నదిలోని నీరు వివిధ రంగులలో కనిపిస్తుంది.
దాదాపు 62 మైళ్ల పొడవు .. 65 మైళ్ల వెడల్పు ఉన్న ఈ నది అతి గొప్ప లక్షణం ఏమిటంటే... ఈ నది నీటిలో ప్రమాదకరమైన చేపలు లేదా జీవులు కనిపించవు.