Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TFPC: పది రోజులు థియేటర్స్ బంద్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన..

ఈ మేరకు టీఎఫ్పీసీ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో థియేటర్స్ బంద్ కావడం సుధీర్ఘ వివరణ ఇచ్చారు. గుంటూరు సహా అంధ్రాలోని పలువురు సినిమా థియేటర్ల యజమానులు కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని.. దీంతో డిజిటల్ ప్రొవైడర్లకు ఛార్జీ చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

TFPC: పది రోజులు థియేటర్స్ బంద్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన..
Cinema Theatres
Follow us
Rajitha Chanti

|

Updated on: May 16, 2024 | 10:04 PM

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్ని పదిరోజులు బంద్ కానున్నాయని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందించింది. ఓ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం వల్లే థియేటర్లలో ప్రస్తుతం సినిమాలు రిలీజ్ కావడం లేదని వస్తున్న వార్తలను ఖండించింది. అది కేవలం థియేటర్స్ యజమానుల వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించింది. ఈ మేరకు టీఎఫ్పీసీ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో థియేటర్స్ బంద్ కావడం సుధీర్ఘ వివరణ ఇచ్చారు. గుంటూరు సహా అంధ్రాలోని పలువురు సినిమా థియేటర్ల యజమానులు కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని.. దీంతో డిజిటల్ ప్రొవైడర్లకు ఛార్జీ చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

తెలంగాణలోని కొన్ని థియేటర్ల యజమానులు.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదనే నిర్ణయాన్ని చూపించారని.. అలాగే ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఓ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం వల్లే థియేటర్లు క్లోజ్ అయ్యాయనే వస్తున్న వార్తలను తాము ఖండిస్తున్నామని.. సినిమా థియేటర్ యజమానులుగానీ.. మరే ఇతర అసోసియేషన్ గానీ అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు.

కాబట్టి థియేటర్లు బంద్ అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. తమ సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తాయి అని ప్రకటన పేర్కొన్నారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు బుధవారం నుంచి పది రోజులపాటు ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.