AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చనిపోయాను అని ప్రచారం చేశారు.. చలాకీ చంటి ఎమోషనల్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. చలాకీ చంటిగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్‌ షోలోనూ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు

నేను చనిపోయాను అని ప్రచారం చేశారు.. చలాకీ చంటి ఎమోషనల్
Chalaki Chanti
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2025 | 9:09 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో  చలాకి చంటి ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చంటి. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం చలాకీ చంటి సినిమాల్లో కనిపించడం లేదు.. అలాగే జబర్దస్త్ లోనూ పెద్దగా కనిపించడం లేదు.. గతంలో తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలు, అలాగే కెరీర్ అడ్డంకులపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు చలాకి చంటి. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో చర్చనీయాంశంగా మారాయి. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తనపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చంటికి హార్ట్ ఎటాక్, బైపాస్ సర్జరీ జరిగింది, చంటి ఇక లేడు వంటి తప్పుడు ప్రచారం చేశాయని ఆయన అన్నారు.

ఆలాంటి తప్పుడు వార్తలు చూసినప్పుడు తనకు కోపం రాలేదని, పైగా థ్యాంక్స్ చెప్పాలనిపించిందని చంటి అన్నారు. కనీసం తన అనారోగ్యం గురించి జనాలకు తెలిసింది కదా అని, క్లిక్‌ల కోసం ఇలాంటి వార్తలు రాసిన ఛానెళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వారి వ్యూస్, రేటింగ్స్‌కు ఉపయోగపడ్డానని, తనను గుర్తించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అయితే, తన కెరీర్‌కు సంబంధించి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని చంటి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఈగో ఉందని, షూటింగ్‌కు వస్తే కొన్ని అడుగుతాడు అని, సినిమా ఆఫీసులకు వెళ్లి అవకాశాలు అడగడు అని బ్యాడ్ ప్రొపగాండా చేశారన్నారు. ఈ ప్రచారం వల్ల తన కెరీర్‌లో కొన్ని అవకాశాలు రాకుండా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఆయన కడుపు మంటతో శాపనార్థాలు పెట్టారు. భగవంతుడి సాక్షిగా, తాను తినే తిండి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను అడ్డుకున్న ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోవాలని శపించారు చంటి.

తనకు అవకాశాలు రాకుండా చేసిన వారు నేల నాకేస్తారు, నాశనమైపోవాలి  అని మండిపడ్డారు. ఈ నాశనాన్ని తాను బతికుండగానే చూడాలని భగవంతుడిని రోజుకు వంద సార్లు కోరుకుంటానని చెప్పారు. ఇతరుల చెడు కోరకూడదని చెప్పే సూత్రాన్ని తాను అంగీకరించనని చంటి స్పష్టం చేశారు. ఒక సాధారణ మానవుడిగా, తన చెడును కోరిన వారి చెడును తాను ఎందుకు కోరకూడదని ప్రశ్నించారు. నేను బాగోలేనప్పుడు నువ్వు ఎందుకు బాగుండాలి.? నేను పాడై నేను నాశనం అయిపోవడానికి కారణం అయిపోయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంటి. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.