Dress Code Controversy: నిండుగా కప్పుకుంటేనే గౌరవాలు నిలబడతాయా? డ్రస్ కోడ్‌పై కర్రపెత్తనాలేల..
వాలుజడ, వడ్డాణాల కాలం ఎప్పుడో పోయింది. కనీసం, చేతులకు గాజులేసుకోవడాలు కూడా వాళ్లవాళ్ల ఇష్టాల మీదే ఆధారపడి ఉండేది. అటువంటిది, ఫలానా దుస్తులే కరెక్టని, చీర కట్టుకునే బైటికిరావాలని రూల్‌బుక్ పెట్టడం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లాంటిదే. అమ్మాయిలకు తాము ధరించే దుస్తుల్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని, దీనిపై విద్యాసంస్థలే కాదు తల్లిదండ్రులు కూడా కలుగజేసుకోకూడదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే గత ఆగస్టులో రూలింగ్ ఇచ్చింది.

కొన్ని సినిమా పాటల్లో డ్యాన్సులు అసభ్యంగా ఉన్నాయని, వాళ్లు వేసుకునే కాస్ట్యూమ్స్ నికృష్టంగా ఉన్నాయని, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ఇదే ఏడాది మార్చి 20న తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. సినిమా అంటే సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళల్ని అవమానకరంగా చూపిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించింది కూడా. కట్‌చేస్తే, ఇటీవలే ఇదే సబ్జెక్ట్ మీద, మహిళల వస్త్రధారణ, చీరకట్టు గొప్పదనం గురించి నటుడు శివాజీ చేసిన ఒక కామెంట్ సంచలనంగా మారింది. ఇలానేనా మాట్లాడేది, మహిళలంటే విలువ లేదా అని అదే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని శివాజీని బోన్లో నిలబెట్టబోతోంది. ఆడవాళ్లు, ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్ల డ్రస్ సెన్స్ మీద మోరల్ పోలిసింగ్ కరెక్టేనా? టేస్ట్‌కీ, ట్రెడిషన్‌కీ మధ్య జరిగే ఈ సెన్సారింగ్ ఎంతవరకు సమంజసం? రామ్‌తేరి గంగా మైలీ.. ఎయిటీస్‌లో వచ్చిన రాజ్‌కపూర్ అద్భుత దృశ్యకావ్యం. ఆ సినిమాను అంతెత్తుకు తీసుకెళ్లిన అతిపెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే, హీరోయిన్ మందాకిని వంటిపై ఉల్లిపొర కంటే పల్చగా ఉండే తెల్లటి చీర, పైగా సరస్సులో జలకాలాడే పాటసీను. ఇదేంటయ్యా డైరెక్టరూ ఇంత ట్రాన్స్‌పరెన్సీనా అని విమర్శకులు నిగ్గదీస్తే, ఆమె కట్టింది చీరే కదా మీకేంటి అభ్యంతరం అని వాళ్ల నోళ్లు మూయించారట అలనాటి దర్శకరత్నం రాజ్‌కపూర్. ఈ శారీ ఎపిసోడ్‌ను ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న చీరోపాఖ్యానమే. ఆడవాళ్లకి, ముఖ్యంగా సినిమా ఆడవాళ్లకుండాల్సిన...
