అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. ఆమె గురించి అసలు విషయం బయటపెట్టిన రమాప్రభ
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు సీనియర్ నటి రమాప్రభ. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు రమాప్రభ. కాగా ప్రస్తుతం రమాప్రభ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రముఖ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రమాప్రభ. వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమా ప్రభ. వయో భారంతో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. 78ఏళ్ల రమాప్రభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఓ హీరోయిన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరి గురించి చెప్పారంటే..
అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?
ఈ వీడియోలో దివంగత నటి సౌందర్య గురించి రమాప్రభ మాట్లాడారు.. ఆమె మాట్లాడుతూ.. సౌందర్య పేరుకు తగ్గట్టే సౌందర్యవంతమైన అమ్మాయి. ఆమె సంస్కారం, ప్రవర్తన, అంకితభావం, ప్రేమ, పెద్దలు, చిన్నల పట్ల మర్యాద వంటి సుగుణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రమాప్రభ తెలిపారు. సినిమా షూటింగ్ లలో సౌందర్య ఎక్కువ మాట్లాడేది కాదని, ప్రశాంతంగా, ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేదని రమాప్రభ గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ తన తల్లి పక్కనే ఉండేదని రమాప్రభ తెలిపారు.ఆమెతో కొన్ని సినిమాల్లో నటించాను.. చివరిగా వచ్చిన జయం మనదేరా సినిమా వరకు తాను సౌందర్యతో కలిసి నటించిన అన్ని చిత్రాలలో ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు చూడలేదని రమాప్రభ అన్నారు. అంత బిజీగా ఉన్న హీరోయిన్ అయినా కూడా సౌందర్యలో ఏమాత్రం మార్పు లేకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని రమాప్రభ అన్నారు.
మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన
అలాగే ఒకసారి షాపింగ్‌కు వెళ్ళినప్పుడు, రమాప్రభ సౌందర్య ఫేస్ క్రీమ్స్ పట్ల ఆసక్తి చూపకపోవడం గమనించిన సౌందర్య, తనకు నచ్చినవి తీసుకోమని ప్రేమగా చెప్పారట. ఆ సమయంలో తాను క్రీములు వాడనని, పాత చిట్కాలైన శెనగపిండి, పెరుగు, పాలు వంటి వాటినే వాడతాను అని సౌందర్య చెప్పిన మాటలు రమాప్రభ గుర్తు చేసుకున్నారు. సౌందర్య అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోదు, ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడాదు, తన నటన, పుస్తకాలు చదువుకోవడంపైనే దృష్టి పెట్టేది అని రమాప్రభ అన్నారు. షూటింగ్ లో మూడ్ ఉన్నప్పుడు ఇద్దరూ పుస్తకాలు, పాత మేకప్‌లు, డ్రెస్సులు, నటన గురించి మాట్లాడుకునేవారని ఆమె తెలిపారు. సౌందర్య లాంటి అద్భుతమైన వ్యక్తిత్వం, అందం ఉన్న హీరోయిన్ మళ్ళీ రాలేదని రమాప్రభ అన్నారు. చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆకస్మిక మరణం తనను ఎంతగానో బాధించిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సుమారు 20-25 ఏళ్ల క్రితం ఉన్న శ్రవంతి గెస్ట్ హౌస్‌లో సౌందర్య కొత్త నటిగా ఉన్నప్పుడు బస చేసేవారట. ఎన్నో సినిమాలలో నటించి పెద్ద హీరోయిన్ అయిన తర్వాత కూడా ఆమె అదే రూంలో దిగేవారని, ఆమె మరణానంతరం ఆ గదికి సౌందర్య రూమ్ అని పేరు పెట్టారని రమాప్రభ తెలిపారు. అంతఃపురం వంటి చిత్రాలలో సౌందర్య నటనను ప్రశంసిస్తూ, ఆమె దేవత పాత్రలైనా, గృహిణి పాత్రలైనా, మోడ్రన్ పాత్రలైనా ఎంతో హుందాగా, నీట్‌గా చేసేవారని, తన డ్రెస్సింగ్, మేకప్ ఎప్పుడూ ఆడతనానికి భిన్నంగా ఉండేది కాదని రమాప్రభ పేర్కొన్నారు. సౌందర్య అనే పేరుకు పరిపూర్ణ న్యాయం చేసిన ఒకే ఒక్క నటి సౌందర్య అని రమాప్రభ తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

Soundarya News
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




