చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె
అప్పుడు బాలనటులుగా సిల్వర్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగిన నటీనటులు ఎందరో ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా మారిపోయి.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా.? రణ్‌బీర్ కపూర్, మహేష్ బాబులాంటి స్టార్ హీరోలతో ఫోటోలు దిగిన ఈ చిన్నది.

టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది ఇప్పుడు హీరోయిన్ గా మారి అందాలతో కవ్విస్తుంది. ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా మారిపోయారు. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్, ఆకాష్ పూరి, బాంధవి శ్రీధర్, ప్రీతీ అన్సారి, గౌరీ కిషన్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది ఉన్నారు. ఇక ఆ కోవకు చెందింది ఈ అందాల భామ.. ఆమెను ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేరు గురూ.. పై ఫొటోలో రణబీర్ కపూర్ తో ఉన్న బ్యూటీ మరెవరో కాదు..
చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఆ బ్యూటీ.. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ చిన్నది. సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఆమె యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి. హుషారు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ వయ్యారి. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది.
అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది. ఈ చిన్నది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.








