అచ్యుత్ గుర్తున్నాడా.? ఆయన తమ్ముడు తెలుగులో తోపు హీరో.. చాలా ఫెమస్
అచ్యుత్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తమ్ముడు సినిమా. ఆరోజుల్లో పవన్ కల్యాణ్, అచ్యుత్ రియల్ లైఫ్ లోనూ అన్నదమ్ములు గానే మెలిగారని చెప్పుకునేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అచ్యుత్ నటించాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించారు అచ్యుత్.

ఎంతో మంది నటీనటులు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమ నటనతో మెప్పించిన చాల మంది నటీనటులు ఈ లోకం విడిచివెళ్లిపోయారు. కొంతమంది అనారోగ్యం కారణంగా చనిపోగా.. మరికొంతమంది అనుకోని ప్రమాదాలతో కన్నుమూశారు. అలా ఈ లోకం విడిచి వెప్పిపోయిన నటుల్లో అచ్యుత్ ఒకరు. చాలా మందికి ఈ నటుడు తెలిసే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అచ్యుత్ హీరోకు అన్నయ్యగా నటించాడు. దీంతో పాటు చిరంజీవి బావగారు బాగున్నారా, బాలకృష్ణ నరసింహా నాయుడు, వెంకటేష్ కలిసుందాం రా, మహేష్ బాబు మురారి, డాడీ, వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సహాయక నటుడిగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా పవన్ నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ, తమ్ముడు సినిమాలలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు అచ్యుత్.
సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!
కేవలం సినిమాలే కాదు ఒకప్పుడు భయపెట్టిన అన్వేషితలాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇలా ఆడియెన్స్ ను అలరించిన అచ్యుత్ కేవలం 42 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఈ యాక్టర్ 2002లో గుండె పోటుతో కన్నుమూశాడు. అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వర ప్రసాద్. ఇతని భార్య పేరు రమా దేవి. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అచ్యుత్ కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటోంది. అయితే అచ్యుత్ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. సొంత తమ్ముడు కాకపోయినా కూడా.. ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది. సొంత సోదరుడిగానే అతన్ని ట్రీట్ చేసేవాడు అచ్యుత.
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్
అతను మరెవరో కాదు ప్రదీప్. నటుడు ప్రదీప్ అంటే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ వెంకటేష్ , వరుణ్ తేజ్ నటించిన ‘F2’ మరియు ‘F3’ చిత్రాల్లో ‘అంతేగా.. అంతేగా’ అనే ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ప్రదీప్ కూడా ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ముద్దమందారం, నాలుగు స్థంభాలాట, రెండు జెళ్ల సీత వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాల్లో ఆయన నటించాడు. అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత సీరియల్స్ లోనూ నటించారు ప్రదీప్. అప్పుడే అచ్యుత్ కు ప్రదీప్ పరిచయమయ్యారు. ప్రదీప్ తో కలిసి కొన్ని సీరియల్స్ ను నిర్మించారు అచ్యుత్. అలా ప్రొఫెషనల్ పరంగా మంచి స్నేహితులైన వీరు సొంత అన్నదమ్ములుగా ఉండేవారట. ఈ విషయాన్ని ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. అంతే కాదు అచ్యుత్ తన చేతుల్లోనే చనిపోయాడంటూ ప్రదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







