అందుకే నాగార్జునతో నటించలేదు.. అసలు విషయం చెప్పిన భాను ప్రియా
సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సీనియర్ హీరోలు విలన్స్ గా మారుతుంటే.. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ అమ్మ, అత్త పాత్రలు చేసి అభిమానులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో భాను ప్రియాఒకరు. భాను ప్రియా అంటే ఒకప్పుడు సంచలనం.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి భానుప్రియ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు భాను ప్రియా. హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటించి అలరించారు భానుప్రియ. హీరోయిన్ గా రాణించిన భానుప్రియ ఆతర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి పలు సినిమాలు చేశారు. ఛత్రపతి సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా నటించి అలరించారు భాను ప్రియా. ఇదిలా ఉంటే గతంలో భాను ప్రియా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తొలినాళ్లలో దర్శకుడు వంశీ గారితో పెళ్లి వార్తలు వచ్చినప్పుడు, తన తల్లి అంగీకరించలేదని, ఆయన అప్పటికే పెళ్లి అయ్యిందని అందుకే తన తల్లి పెళ్లికి ఒప్పుకోలేదు అని తెలిపారు భానుప్రియ. భాను ప్రియా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే, నాగార్జునతో నటించలేదు. కేవలం అన్నమయ్య సినిమాలో నటించారు. దీని పై ఆమె స్పందిస్తూ.. నాగార్జునతో జతకట్టే అవకాశం రాలేదని తెలిపారు. అప్పట్లో తను పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా కారణమై ఉండొచ్చు అని చెప్పారు. ఇక భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ గురించి మాట్లాడుతూ, ఆమె ముంబైలో స్థిరపడ్డారని తెలిపారు.
అదేవిధంగా శాంతిప్రియ జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటనను భానుప్రియ పంచుకున్నారు. శాంతిప్రియ భర్త చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో మరణించారని తెలిపారు. ఈ సంఘటన శాంతిప్రియను మానసికంగా చాలా కుంగదీసిందని, అయితే కుటుంబ సభ్యుల అండతో ఆమె ఆ కష్టం నుండి బయటపడ్డారని వివరించారు. తెలుగులో విజయవంతమైన కెరీర్ తర్వాత హిందీ సినిమాల్లోకి ప్రవేశించిన భానుప్రియకు అక్కడ అంతగా విజయం లభించలేదని ఆమె అంగీకరించారు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ, వాటిలో తన పాత్రలు చిన్నవిగా, ప్రాధాన్యత లేనివిగా ఉండేవని తెలిపారు. కాగా కెరీర్ బిగినింగ్ లో తన వాయిస్ సన్నగా ఉండటం, ఎమోషన్స్ సరిగా పలికించలేకపోవడం వల్ల డబ్బింగ్ చెప్పుకునే అవకాశం రాలేదని చెప్పారు. అయితే, అన్వేషణ చిత్రం నుంచే తాను స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టానని భానుప్రియ తెలిపారు. వంశీ గారితో మాట్లాడి, వాయిస్ టెస్ట్ చేయించుకుని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి తన డబ్బింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో మంచి పాత్రలు, సినిమా ఆఫర్లు రావడం లేదని భానుప్రియ వెల్లడించారు. అయితే, ఇటీవలే మోహన్ బాబు గారు తనను కలిసి పెద్దరాయుడు సినిమా గురించి ప్రస్తావించారని, ఆ కాంబినేషన్‌లో మళ్లీ సినిమాలు చేసే అవకాశం గురించి మాట్లాడారని, భవిష్యత్తులో తనకు ఆఫర్ రావొచ్చని భానుప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు భాను ప్రియా..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
