ఆ గ్రామంలో పాములే పెంపుడు జంతువులు, కుటుంబ సభ్యులు 

10 April 2024

TV9 Telugu

ఒక గ్రామంలోని గ్రామస్తులు పాములను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటితో కలిసి జీవిస్తారు. కనుక ఈ గ్రామానికి పాముల గ్రామం అనే పేరు వచ్చింది 

 పాముల గ్రామం 

అయితే ఈ గ్రామంలోని ప్రజలు పాములను తమ కుటుంబ సభ్యుల్లా ఎందుకు పెంచుకుంటారు..అసలు ఆ పాములు విషపూరితమా? మనుషులను కాటు వేస్తాయా తెలుసుకుందాం  

కుటుంబ సభ్యుల్లా పాములు 

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం షెట్‌పాల్ విలేజ్. ఇక్కడ నివసించే గ్రామస్థులు తమతో పాటు పాములను కూడా పెంచుకుంటారు. 

షెట్‌పాల్ విలేజ్

ఈ గ్రామంలో దాదాపు 2,600 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామం జనాభా కంటే పాములు ఎక్కువగా ఉన్నాయట.. అయినప్పటికీ పాములు గ్రామస్థులతో కలిసి హాయిగా జీస్తున్నాయి

జనాభా కంటే పాములే ఎక్కువ 

గ్రామస్తులు పాములను కుటుంబసభ్యులుగా భావించి వాటి కోసం ఇంటిలోనే నివసించేందుకు బొరియలను ఏర్పాటు చేస్తారట. పిల్లలు కూడా పాములతో కలిసి ఆడుకుంటారు.

ఇళ్ళల్లో నివసించే పాములు 

ఇంటి సభ్యుల్లాగే పాములు ఇంటి లోపల సంచరిస్తుంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పాములతో కలిసి ఆడుకుంటారు. అవి కూడా ఎవరినీ కాటు వేసిన సందర్భం లేదట.  

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా 

నాగర పంచమి రోజున పామును పూజిస్తే సంవత్సరం పొడవునా నాగరాజుకు సేవ చేసినట్లు ఊరి ప్రజలు భావిస్తారు.  పాముని భక్తితో పుజిస్తారు.

నాగర పంచమి

ఈ గ్రామంలోని పాఠశాల గదుల్లో పాములు సంచరించడమే కాకుండా స్టూడెంట్స్ కూడా పాములను పాఠశాలకు తీసుకు వెళ్తారట. టీచర్స్ స్టూడెంట్స్ తో పాటు పాములకు కూడా బోధిస్తారు.

పాఠశాలలో పాములు