ఊరు ఊరంతా చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు..  

31 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

తమిళనాడులోని దిండిగల్ నుండి వందలాది మంది ప్రజలు చెరువులో చేపలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

చేపల వేటకు వెళ్లే గ్రామం 

దిండిగల్‌లోని కుట్టుపట్టి గ్రామంలో చేపల వేట పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

పూర్వ కాలం నుంచి  

ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభానికి ముందు ఈ పండుగను జరుపుకుంటారు. దీని కోసం గ్రామమంతా చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకు చేరుకుంటారు.

వేసవి ప్రారంభానికి ముందు

చెరువులో పట్టిన అన్ని చేపలను ఇంటికి తీసుకుని వచ్చి వండుతారు. చేప పూర్తిగా ఉడికిన తర్వాత దానిని దేవుడికి నైవేద్యంగా పెడతారు.

దేవతకు సమర్పణ 

గ్రామస్థులు వండిన చేపలను దేవుడికి నైవేద్యంగా పెడితే రాబోయే కాలంలో తమ పొలాల్లో మంచి పంట పండుతుందని విశ్వాసం 

పొలాల్లో మంచి పంట

భగవంతుడు తమకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని, అందుకే ప్రతి సంవత్సరం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటామని చెబుతారు.

మంచి ఆరోగ్యం

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఏడాది పండగ వీడియోకు జనాలు రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.

రకరకాలుగా రియాక్షన్స్