AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju- Ali: ఆరోజు అర్ధరాత్రి 3 గంటలకు స్మశానంలో.. కృష్ణంరాజు గురించి ఆసక్తికర విషయం చెప్పిన అలీ

రాజకీయాల్లోకి ఎంటరయ్యాక సినిమాలు బాగా తగ్గించేశాడు అలీ. అయితే ఈ మధ్యన పాలిటిక్స్ వద్దని మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడీ స్టార్ కమెడియన్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ దివంగత నటుడు కృష్ణంరాజు గురించి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నాడు.

Krishnam Raju- Ali: ఆరోజు అర్ధరాత్రి 3 గంటలకు స్మశానంలో.. కృష్ణంరాజు గురించి ఆసక్తికర విషయం చెప్పిన అలీ
Krishnam Raju, Ali
Basha Shek
|

Updated on: Feb 19, 2026 | 7:10 PM

Share

దివంగత నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాను శాసించిన స్టార్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు ఆయన సినీ వారసత్వాన్ని ప్రభాస్ కంటిన్యూ చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ తోటి నటీనటులను ఎంత బాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి మరీ తోటి యాక్టర్స్ కడుపు నింపుతుంటాడు. కృష్ణం రాజు, ప్రభాస్ ఫుడ్ పెట్టడం, వారి మర్యాదలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అనేక సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా స్టార్ కమెడియన్ అలీ కూడా కృష్ణంరాజుతో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కు కృష్ణంరాజు సతీమణి హాజరయ్యారు. అలీ కూడా ఇదే ఈ వెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ బిల్లా సినిమా షూటింగ్ లో భాగంగా మలేషియాలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకుఉన్నాడు.

‘రాత్రి 3 గంటలకు చిమ్మ చీకటి. స్మశానంలో బిల్లా సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు కృష్ణంరాజు గారు నా దగ్గరికి వచ్చి అరె అలీ కీమా బిర్యానీ ఉంది తింటావా అని అడిగారు. అర్ధరాత్రి బిర్యానీ ఏంటండీ.. అది కూడా స్మశానంలో అంటే.. సమాధులను చూపిస్తూ వాళ్లకు అవకాశం లేదురా మనకు ఛాన్స్ ఉంది అన్నారు. అప్పుడే శ్యామల గారు బిర్యానీ తీసుకొచ్చి వడ్డిస్తే అర్ధరాత్రి అక్కడ స్మశానంలో బిర్యానీ తిన్నాం. బిల్లా సినిమా షూటింగ్ కోసం దాదాపు 40 రోజులు మలేషియాలో ఉన్నాం. అప్పుడు కృష్ణం రాజుగారు రోజుకొక ఐటెం తెచ్చిపెట్టేవాళ్ళు. ఒకసారి తెచ్చిన ఫుడ్ ఐటెం మళ్లీ తెచ్చేవాళ్లు కాదు’ అని అప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు అలీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భార్య జుబేదాతో కమెడియన్ అలీ.. వీడియో..

View this post on Instagram

A post shared by Zubeda Ali (@zubedaspage)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా