Black Dog turns White: ఇదేం విచిత్రం.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్

కొన్ని వింతైన వ్యాధులు మనుషుల్లోనే కాకుండా వివిధ రకాల జంతువులలో కూడా కనిపిస్తాయి. అలాంటి వింత వ్యాధి భారీన పడిన ఓ కుక్కకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం నల్లగా ఉన్న ఓ కుక్క ప్రస్తుతం పూర్తిగా తెల్లగా మారిపోయింది. బొల్లి వ్యాధి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా ఇది మనుషులకు సోకుతుంది. కానీ ఓ కుక్కకు ఈ వ్యాధి సోకడం వల్ల కేవలం రెండేళ్లలో..

Srilakshmi C

|

Updated on: May 01, 2024 | 7:30 PM

కొన్ని వింతైన వ్యాధులు మనుషుల్లోనే కాకుండా వివిధ రకాల జంతువులలో కూడా కనిపిస్తాయి. అలాంటి వింత వ్యాధి భారీన పడిన ఓ కుక్కకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  రెండేళ్ల క్రితం నల్లగా ఉన్న ఓ కుక్క ప్రస్తుతం పూర్తిగా తెల్లగా మారిపోయింది.

1 / 5
బొల్లి వ్యాధి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా ఇది మనుషులకు సోకుతుంది. కానీ ఓ కుక్కకు ఈ వ్యాధి సోకడం వల్ల కేవలం రెండేళ్లలో ఈ కుక్క నలుపు రంగు నుంచి పూర్తిగా తెల్లగా మారింది. 2021లో సదరు సునకానికి బొల్లి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

2 / 5
బొల్లి అనేది ఒక చర్మ వ్యాధి. ఇది సోకడం వల్ల మెలనిన్ ఉత్పత్తికి కారణమైన మెలనోసైట్లు క్రమంగా నాశనం అయ్యి.. చర్మం రంగులో మార్పులు సంభవిస్తాయి. చర్మం, వెంట్రుకలు, కళ్ల రంగులో మెలనిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3 / 5
మెలనోసైట్ కోల్పోవడం వల్ల ముఖం, చేతులు, పాదాలు, జననేంద్రియాలతో సహా శరీరంలోని వివిధ భాగాలలో తెల్లటి పాచెస్ కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ.. దీని వల్ల ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు.

4 / 5
తెల్లగా మారిన ఈ నల్ల కుక్క యజమాని మాట్ స్మిత్ తన పెంపుడు కుక్క అనారోగ్యం గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఓ పోస్ట్‌ ద్వారా పంచుకున్నాడు. కేవలం రెండేళ్లలో తన పెంపుడు కుక్క పూర్తిగా రంగు మారిన ఫోటోలు నెటిజన్లతో పంచుకున్నాడు. నల్లగా ఉన్న కుక్కకు మొదట్లో శరీరంపై తెల్లటి మచ్చలు కనిపించాయి. అయితే బొల్లి వ్యాధి కారణంగా కుక్క కేవలం రెండేళ్లలో పూర్తిగా తెల్లగా మారిపోయినట్లు స్మిత్‌ తెలిపాడు.

5 / 5
Follow us